వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నది రాహుల్ కాదు, రాజీనామా చేస్తా - బీజేపీతో కుమ్మక్కు ఆరోపణలపై ఆజాద్ వివరణ

|
Google Oneindia TeluguNews

నాయకత్వ సంక్షోభంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం భేటీ కాగా.. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కేంద్రంగా పెనుదుమారం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ దుస్థితిని వివరిస్తూ, ప్రక్షాళన అవసరమంటూ 23 మంది సీనియర్ల సంతకాలతో అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖను ఆజాదే డ్రాఫ్ట్ చేయించారని, మీటింగ్ లో ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయని, బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించారంటూ కొద్ది గంటలుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆజాద్ స్వయంగా క్లారిఫికేషన్ ఇచ్చారు.

Recommended Video

Congress President: గాంధీయేతర వ్యక్తికే పగ్గాలు ఖాయమా? Rahul Gandhi, Priyanka Gandhi అనాసక్తి

''సీనియర్లు బీజేపీతో కుమ్మక్కయి పార్టీ వ్యతిరేక కలాపాలు నెరపుతున్నారనే మాట రాహుల్ గాంధీ నోటి నుంచి వచ్చింది కాదు. ఆయనలా మాట్లాడే వ్యక్తి కూడా కాదు. అయితే, సీడబ్ల్యూసీ మెంబర్లు కాని ఇతర నేతలు కొందరు మాపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీకి లాభం చేకూరేలా సోనియా గాంధీకి లేఖ రాశామని విమర్శించారు. అన్నది రాహుల్ కానప్పటికీ, ఈ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఆధారాలు చూపిస్తే వెంటనే రాజీనామా చేస్తాననే మాటకు కట్టుబడి ఉన్నాను''అని ఆజాద్ తెలిపారు. అంతేకాదు,

ఆజాద్.. 45 ఏళ్ల గులాంగిరీకి ఇదా బహుమానం? ముస్లిం కాబట్టేగా - అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలుఆజాద్.. 45 ఏళ్ల గులాంగిరీకి ఇదా బహుమానం? ముస్లిం కాబట్టేగా - అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

cwc updates: Some colleagues, not Rahul Gandhi, accused us of collusion with BJP: Azad clarify

సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి ఒక వర్గం మీడియాలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేస్తున్నాయని, వాటిలో అధిక శాతం తప్పుడు వార్తలే ఉన్నాయని, రాహుల్ గాంధీ అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేయడం తగదని గులాం నబీ హితవుపలికారు. ఇతర పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ పారదర్శకత పాటిస్తుందని, ఏది జరిగినా ప్రజలకు తెలిసేలానే వ్యవహరిస్తుందని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే,

cwc: కపిల్ సిబల్ అంతరిక్ష పల్టీ - నిమిషాల్లోనే ట్వీట్ డిలిట్ - రాహుల్ ఆ మాట అనలేదటcwc: కపిల్ సిబల్ అంతరిక్ష పల్టీ - నిమిషాల్లోనే ట్వీట్ డిలిట్ - రాహుల్ ఆ మాట అనలేదట

cwc updates: Some colleagues, not Rahul Gandhi, accused us of collusion with BJP: Azad clarify

సీడబ్ల్యూసీ మీటింగ్ లో గులాం నబీపై వ్యక్తమైన అభిప్రాయాలంటూ మీడియాలో వచ్చిన వార్తలపై బీజేపీ, మజ్లిస్ పార్టీ నేతలు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్ల గులాంగిరీకి తగిన శాస్తి జరిగిందని, ముస్లింలకు కాంగ్రెస్ పార్టీనే పెద్ద ద్రోహి అని ఇప్పటికైనా గుర్తించాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అనగా, నాడు జ్యోతిరాదిత్య సింధియాలాగే, హైకమాండ్ ను ప్రశ్నించిన పాపానికి అజాద్, కపిల్ సిబాల్ ను ఆడుకుంటున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.

English summary
Ghulam Nabi Azad has issued a clarification on his offer to resign as well as media reports that Rahul Gandhi accused him and 22 others of colluding with the BJP. Some colleagues, not Rahul Gandhi, accused us of collusion with BJP says Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X