వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CWCలో ఊహించిన ట్విస్ట్: సారధిగా సోనియా గాంధీ కొనసాగింపు - నేతల ఒత్తిడి వల్లే?

|
Google Oneindia TeluguNews

నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా కొనసాగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో అందరూ ఊహించిన పరిణామమే చోటుచేసుకుంది. కొత్త సారధిపై ఎంతకీ క్లారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగనున్నారు. గాంధీయేత కుటుంబానికి చెందిన వ్యక్తికి సారధ్య బాధ్యతలు కట్టబెట్టాలని సోనియా కుటుంబం భావించగా, అందుకు నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం, సోనియానే కొనసాగాలని నేతలు ఒత్తిడి చేయడంతో ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

Recommended Video

Sonia Gandhi -'Will Step Down,Find A New Chief' Sonia Responds To Congress Leaders Letter

అజెండా మేరకే సోమవారం నాటి సీడబ్ల్యూసీ భేటీలో చర్చ చేపట్టగా.. ఆదివారం నాటి లేఖపై తీవ్ర గందరగోళం ఏర్పడింది. పార్టీకి శక్తిమంతమైన నాయకత్వం అవసరమని, పార్టీని కింది నుంచి పైదాకా ప్రక్షాళన చేయాలంటూ 23 మంది సీనియర్లు సోనియా గాంధీకి లేఖ రాసిన తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఈ క్రమంలో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ లాంటి నేతలను ఉద్దేశించి 'బీజేపీతో కుమ్మక్కయ్యార'నీ ఆయన అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

అన్నది రాహుల్ కాదు, రాజీనామా చేస్తా - బీజేపీతో కుమ్మక్కు ఆరోపణలపై ఆజాద్ వివరణఅన్నది రాహుల్ కాదు, రాజీనామా చేస్తా - బీజేపీతో కుమ్మక్కు ఆరోపణలపై ఆజాద్ వివరణ

CWC Updates: Sonia Gandhi to continue as partys interim president

దీన్ని రాహుల్ సహా పార్టీ నేతలూ ఖండించారు. కాగా, లేఖ వ్యవహారంపై చెలరేగిన రచ్చ కూడా కొత్త నాయకుడి ఎంపిక ప్రక్రియకు ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో మరికొంత కాలం సోనియా గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగాలని డిసైడ్ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ఆజాద్.. 45 ఏళ్ల గులాంగిరీకి ఇదా బహుమానం? ముస్లిం కాబట్టేగా - అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలుఆజాద్.. 45 ఏళ్ల గులాంగిరీకి ఇదా బహుమానం? ముస్లిం కాబట్టేగా - అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీకి దాదాపు 17 ఏళ్లు నాయకత్వం వహించి, పదవి నుంచి తప్పుకున్న సోనియా.. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో తిరిగి పగ్గాలు చేపట్టారు. అయితే, కొత్త నాయకుణ్ని ఎంపిక చేసుకునేంత వరకే తాను తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉంటానని ఆమె గతంలోనే స్పష్టం చేశారు. అధ్యక్ష అభ్యర్థిపై సీడబ్ల్యూసీలో క్లారిటీ రాకపోవడంతో తప్పనిసరిగా ఆమెనే ఆ పదవిలో కొనసాగనున్నారు.

English summary
Sonia Gandhi will continue on the post of Congress interim president, sources have said. Sonia Gandhi, who took over the post in the aftermath of 2019 Lok Sabha poll debacle in 2019, had earlier expressed her intent to step down. She had requested party leaders to elect another president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X