వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ భక్తి పేరుతో సైబర్ మోసాలు ..అభినందన్ పేరుతో ఫేక్ అకౌంట్లు, స్పందించిన ఐఏఎఫ్

|
Google Oneindia TeluguNews

సైబర్ నేరగాళ్లు దేశభక్తిని వాడుకుంటున్నారు. తాజాగా భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ గా ఉన్న అభినందన్ పాక్ చెరలో బందీ గా ఉన్న సమయంలోనూ ఆయన చూపించిన ధైర్యసాహసాలు భారతదేశ ప్రజల గౌరవానికి కారణమయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా పాక్ చెర నుండి భారత్ కి చేరిన యుద్ధవీరుడు అభినందన్ కు భారత ప్రజలు జయజయ ధ్వానాలు పలికారు. భారతీయుల దేశభక్తిని కూడా కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో నిఘా వర్గాలు ఈ అకౌంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాయి.

<strong>నేడే కేంద్ర క్యాబినెట్ భేటీ ... కీలక నిర్ణయాలు .. ఈ మూడు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన</strong>నేడే కేంద్ర క్యాబినెట్ భేటీ ... కీలక నిర్ణయాలు .. ఈ మూడు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

అభినందన్ పేరుతో సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా అకౌంట్ లు క్రియేట్ చేశారు . సర్జికల్ స్ట్రైక్ తర్వాత జరిగిన పరిణామాలతో అభినందన్ మీద దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో అభినందన్ తో టచ్ లో ఉండాలని భావించిన భారతీయులు ఈ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నారు. దీంతో సదరు నెటిజన్ల అకౌంట్లు హ్యాక్ కు గురవుతున్నాయి. అభినందన్ పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం ద్వారా కొందరు సైబర్ నేరగాళ్లు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కొల్లగొడుతున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్న పౌరుల సమాచారాన్ని దేశద్రోహానికి కూడా వాడే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు.

Cyber ​​crime Fake Accounts under the name of Abhinandan, responded IAF

దీంతో అప్రమత్తమైన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు సోషల్‌ మీడియాలో ఎలాంటి అకౌంట్లు లేవని ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ వెల్లడించింది. సోషల్ మీడియా యూజర్లు ఎవరూ అభినందన్ పేరుతో ఉన్న అకౌంట్లను ఫాలో కావొద్దని సూచించింది. ఆయన పేరుతో ఉన్నవన్నీ ఫేక్ అకౌంట్లేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు అభినందన్ పేరుతో ఉన్న కొన్ని ఫేక్ అకౌంట్లను ఐఏఎఫ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. అభినందన్‌ పేరుతో ఫేక్‌ అకౌంట్లు తెరిచి అసత్యప్రచారం చేస్తుండడంతో పాటు సదరు అకౌంట్ ల దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్న కారణంగా ఐఏఎఫ్ చర్యలు చేపట్టింది.

English summary
The cyber criminals use patriotism. cyber criminals has created accounts with the name of Abhinandan in the social media. The intelligence sources believe that some cyber criminals are screwing citizens' information by creating Fake Accounts in the name of Abhinandan and the information can be misused by the criminals .The IAF announced Wg Cdr Abhinandan Varthaman does not have a social media account on any portal (Facebook /Instagram /Twitter). Please avoid following any fake accounts being used in the name of any IAF Airwarrior for spreading misinformation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X