వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రం బీ కేర్‌ఫుల్ : ఆ యాప్‌ డౌన్‌లోడ్ చేయించి రూ.1.76 కొట్టేసిన కేటుగాళ్లు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని ఉపయోగించి జనాల జేబులు గుల్ల చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తిని బురిడీ కొట్టించిన కేటుగాడు లక్షన్నర రూపాయలు కొట్టేశాడు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టేందుకు ఇంటర్నెట్‌ను ఆశ్రయించిన బాధితున్ని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు పక్కా ప్లాన్‌తో బాధితుని బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేశారు. అసలు విషయం తెలిసి బాధితుడు లబోదిబోమంటున్నాడు.

ఓ తల్లి దైన్యం : మొగుడు లేడు.. పెంచే స్థోమత లేదు..! అమ్మకానికి కన్న పేగు!ఓ తల్లి దైన్యం : మొగుడు లేడు.. పెంచే స్థోమత లేదు..! అమ్మకానికి కన్న పేగు!

ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్‌తో వల

ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్‌తో వల

రాచకొండ కమిషనరేట్ పరిథిలోని ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 11న క్రెడిట్ కార్డు బిల్లు రూ.23వేలను ఫోన్‌‌పే యాప్ ద్వారా చెల్లించారు. 24గంటలు గడిచినా అకౌంట్‌లో డబ్బు జమకాకపోవడంతో మరుసటి రోజు ఇంటర్నెట్‌లో ఫోన్‌పే కస్టమర్ కేర్ నెంబర్ వెతికాడు. అందులో ఓ నెంబర్ నోట్ చేసుకున్నాడు. అయితే అది సైబర్ నేరస్థులు పోస్ట్ చేసిన ఫేక్ కస్టమర్ కేర్ నంబర్ అని తెలియక వారికి ఫోన్ చేశాడు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపారు.

యాప్‌తో బురిడి కొట్టించి

యాప్‌తో బురిడి కొట్టించి

సదరు వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసిన కేటుగాడు మొబైల్‌లో ఎనీడెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు. అతడు చెప్పినట్లు చేసిన బాధితుడికి అదే రోజు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎనీడెస్క్ యాప్ ద్వారా వచ్చే లింక్ నెంబర్లను తాను చెప్పిన మొబైల్ నెంబర్లకు పంపాలని చెప్పడంతో అలాగే చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఐడీ నెంబర్‌ను కూడా తాను చెప్పిన నెంబర్‌కు పంపాలని కోరడంతో అలానే చేశాడు. ఇంకేముంది కొద్ది సేపటికే బాధితుడికి చెందిన ఐదు బ్యాంకు అకౌంట్ల నుంచి రూ. 1.76లక్షలు విత్ డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నుంచి రూ.1.3లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రూ.24వేలు, ఎస్బీఐ నుంచి రూ.12వేలు, ఐసీఐసీఐ నుంచి రూ.10వేలు సైబర్ కేటుగాడి బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ఎనీడెస్క్ యాప్‌తో భద్రం అంటున్న పోలీసులు

ఎనీడెస్క్ యాప్‌తో భద్రం అంటున్న పోలీసులు

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఇక అంతే సంగతులని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఆ యాప్ ఉన్న ఫోన్‌లోని డేటా అంతా సైబర్ నేరస్థులకు చేరుతుంది. ఫోన్ కేటుగాళ్ల నియంత్రణలోకి వెళ్లి పోవడంతో దానికి వచ్చే వన్‌టైం పాస్‌వర్డ్‌లు నేరస్థులు ఈజీగా యాక్సెస్ చేసే వీలు కలుగుతుంది. అందుకే ఎనీ డెస్క్ యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లో డౌన్‌లోడ్ చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

English summary
Another Cyber ​​crime has been reported in rachakonda police commissionarate limit. using any desk app cyber criminal looted Rs.1.76lakhs from a person. by positing fake phone pay customer care number Criminals targeting innocent people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X