• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సైకిల్ గర్ల్ జ్యోతి తండ్రి మృతి-నాన్నను కాపాడుకునేందుకు అప్పట్లో 1300కి.మీ సైకిల్‌పై-ఏడాదికే విషాదం

|

సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ సోమవారం(మే 31) గుండెపోటుతో మృతి చెందాడు. బిహార్‌లోని తమ స్వస్థలం దర్భంగాలో ఆయన తుది శ్వాస విడిచాడు.జిల్లా మెజిస్ట్రేట్ డా.ఎస్ఎం త్యాగరాజన్ ఆయన మరణాన్ని ధ్రువీకరించారు. సంబంధిత అధికారులకు సమాచారమిచ్చి... ఆ కుటుంబానికి అవసరమైన సాయం చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. గత ఏడాది లాక్‌డౌన్‌లో ఏకంగా 1300కి.మీ సైకిల్‌పై ప్రయాణించిన జ్యోతి సాహసానికి,ధైర్యానికి అప్పట్లో సర్వత్రా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. జబ్బు పడిన తండ్రిని సైకిల్ వెనుక సీట్లో కూర్చోబెట్టుకుని వారం రోజుల పాటు ఆమె సైకిల్ తొక్కింది.ఎట్టకేలకు స్వస్థలం దర్భంగాకు తండ్రితో పాటు సురక్షితంగా చేరుకుంది.

  Top News : BJP GHMC Manifesto Details | Nivar Update | DGCA Update

  సైకిల్ గర్ల్ జ్యోతి కుమారిపై హత్యాచారం..? సోషల్ మీడియాలో దుమారం.. అసలు కథ వేరే..సైకిల్ గర్ల్ జ్యోతి కుమారిపై హత్యాచారం..? సోషల్ మీడియాలో దుమారం.. అసలు కథ వేరే..

  అప్పట్లో 'జ్యోతి' సంచలనం...

  అప్పట్లో 'జ్యోతి' సంచలనం...


  జ్యోతి తండ్రి సాధారణ ఆటో డ్రైవర్. బతుకు దెరువు కోసం ఢిల్లీలోని గురుగ్రామ్‌కు వెళ్లాడు. కూతురు జ్యోతి కూడా అతనికి చేదోడు వాదోడుగా అక్కడే ఉండేది. గతేడాది లాక్ డౌన్‌కు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను గాయపడ్డాడు. సంపాదించే ఒక్కడూ మంచాన పడటంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయి. గురుగ్రామ్‌లో తాము ఉంటున్న గదికి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడే ఉంటే మున్ముందు తండ్రి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుందని జ్యోతి భావించింది.ఎలాగైనా ఇంటికి చేరుకోవాలన్న ఉద్దేశంతో సైకిల్‌‌పై తండ్రిని కూర్చోబెట్టుకుని ఇంటి బాట పట్టింది. అలా 7 రోజులు సైకిల్ తొక్కుతూ ఎట్టకేలకు గమ్యం చేరుకుంది. సంక్షోభ సమయంలోనూ అత్యంత ధైర్యంగా,సాహసోపేతంగా వ్యవహరించిన జ్యోతికి అప్పట్లో దేశమంతా సలాం కొట్టింది.

  ఆమె తెగువకు ఊహించని అవకాశం... ఇవాంకా ట్వీట్‌తో దుమారం.. సిగ్గుతో తలదించుకోవాలని!ఆమె తెగువకు ఊహించని అవకాశం... ఇవాంకా ట్వీట్‌తో దుమారం.. సిగ్గుతో తలదించుకోవాలని!

  ఇవాంకా సైతం మెచ్చుకుంది...

  ఇవాంకా సైతం మెచ్చుకుంది...

  అంత చిన్న వయసులో ఏమాత్రం అధైర్యపడకుండా... ఎక్కడా అలసిపోకుండా... అంత సుదీర్ఘ దూరం ఆమె సైకిల్‌పై ప్రయాణించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ సైతం జ్యోతి సాహసాన్ని అభినందించింది. అయితే 'బ్యూటీఫుల్' అంటూ అప్పట్లో ఆమె జ్యోతి సాహసంపై ట్వీట్ చేయడంపై వివాదం కూడా నెలకొంది. అదేమీ ఆమె థ్రిల్లింగ్ కోసం చేయలేదని... లాక్ డౌన్ అలాంటి పరిస్థితులను కల్పించిందని పలువురు ఇవాంకాకు కౌంటర్ ఇచ్చారు.

  విషాదంలో జ్యోతి కుటుంబం

  విషాదంలో జ్యోతి కుటుంబం

  అప్పట్లో సైక్లింగ్ ఫెడరేషన్ కూడా జ్యోతిని సైకిల్ రైడర్‌గా తీర్చిదిద్దుతామని ముందుకొచ్చింది. ఇందుకు జ్యోతి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే గతేడాది జ్యోతి పదో తరగతి ఫెయిల్ అవడంతో... ముందు ఆ పరీక్షల్లో పాస్ అవడమే ఆమె మొదటి లక్ష్యం అని జ్యోతి తల్లి అప్పట్లో వెల్లడించారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన జ్యోతి కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయా లేదా అన్నది తెలియదు. స్థానిక అధికారులు ఆ కుటుంబానికి సాయం అందిస్తున్నామని చెబుతున్నారు.

  English summary
  Bihar’s cycle girl Jyoti Paswan who brought her father Mohan Paswan on a bicycle to Darbhanga from Gurugram during the lockdown in 2020, reportedly lost him to a heart attack.DM Darbhanga Dr SM Tyagarajan confirmed the death and informed that BDO of the concerned Singhbara block was sent to provide assistance and homage to the deceased in Sirhulli village.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X