వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Amphan: బెంగాల్, ఒడిశాలో బీభత్సం, 84 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసం

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా/ఒడిశా: ఆంపన్ పెను తుఫాను పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో బీభత్సం సృష్టించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఈ తుఫాను భారీ, ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగించింది. బెంగాల్, ఒడిశాతోపాటు బంగ్లాదేశ్‌నూ అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, ఈదురు గాలులకు 84 మంది మృతి చెందగా, వందలాది మంది గాయాలపాలయ్యారు.

Cyclone Amphan: బెంగాల్‌లో 10 మందికిపైగా మృతి, సీఎం మమత రివ్యూCyclone Amphan: బెంగాల్‌లో 10 మందికిపైగా మృతి, సీఎం మమత రివ్యూ

బెంగాల్‌లోనే 72 మంది మృతి

బెంగాల్‌లోనే 72 మంది మృతి

తుఫాను కారణంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనే 72 మంది మృతి చెందారని సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. వీరిలో 15 మంది కోల్‌కతాకు చెందినవారే ఉన్నారని తెలిపారు. దాదాపు పదేళ్ల తర్వాత బెంగాల్ రాష్ట్రం మరోసారి భారీ తుఫానును ఎదుర్కొందని చెప్పారు. తుఫాను కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

భారీ నష్టం.. మమత పరిహారం..

భారీ నష్టం.. మమత పరిహారం..

తుఫాను కారణంగా మృతి చెందిన బాధితుల కుటుంబసభ్యులకు రూ. 2 లక్షల నుంచి 2.50లక్షల వరకు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని సుందర్భన్స్ ప్రాంతంలో పర్యటించాలని ఆమె కోరారు. భారీ నష్టపోయిన రాష్ట్రానికి సాయం అందించాలని విన్నవించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనతో మాట్లాడారని ఆమె తెలిపారు.

Recommended Video

Cyclone Amphan Was Not Hit AP Coastal
వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం

వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం

కాగా, ఆంఫన్ తుఫాను సృష్టించిన బీభత్సానికి తీర ప్రాంత గ్రామాలతోపాటు కోల్‌కతా నగరంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమవడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఒడిశాలో భారీ మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఆదుకుంటామని మోడీ హామీ

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. కాగా, ప్రధాని మోడీ తుఫాను సృష్టించిన బీభత్సంపై విచారం వ్యక్తం చేశారు. బెంగాల్ రాష్ట్రానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. మమతతోపాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసిన అమిత్ షా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ తుఫాను బంగ్లాదేశ్‌లోనూ బీభత్సం సృష్టించింది. 10 మందికిపైగా మృతి చెందారు. భారీ ఆస్తి నష్టం జరిగింది.

English summary
Cyclone Amphan has reportedly killed 72 people in India and 12 in Bangladesh. Most of the deaths were due to the collapse of walls, drowning and falling trees in both countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X