• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

83 రోజుల తరువాత తొలిసారిగా మోడీ: ఆ రెండు రాష్ట్రాల్లో ప్రధాని టూర్: ఆదుకోవడానికి ప్యాకేజీ

|

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా 14 రోజుల నాలుగో విడత లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నాలుగో దశలో కేంద్ర ప్రభుత్వం భారీగా సడలింపులను ప్రకటించింది. రాష్ట్రాల్లో బస్సులు రోడ్డెక్కాయి. ఈ నెల 25వ తేదీ నుంచి విమానాలు.. వచ్చేనెల 1 నుంచి రైళ్లూ అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా అధికారిక పర్యటన నిర్వహించబోతున్నారు. మరి కాస్సేపట్లో ఈ పర్యటన ప్రారంభం కాబోతోంది.

వైఎస్ జగన్ సంచలన నిర్ణయం: తన ప్రభుత్వంపై తానే: దాని ఆధారంగానే యాక్షన్ ప్లాన్:

83 రోజుల తరువాత తొలిసారిగా ఆయన రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. చివరిసారిగా ఆయన ఉత్తర ప్రదేశ్ జిల్లాలో పర్యటించారు. ఫిబ్రవరి 29వ తేదీన ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్‌లల్లో అధికారికలను చేపట్టారు. అంఫన్ తుఫాన్ బారిన పడిన పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్తారు. మొదట పశ్చిమ బెంగాల్‌లో ఏరియల్ సర్వే చేపడతారు.

Cyclone Amphan: Prime Minister Modi will conduct areal surveys in West Bengal and Odisha

అంఫన్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్న జిల్లాలను పరిశీలిస్తారు. తూర్పు మిడ్నాపూర్, పశ్చి మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణ, దక్షిణ 24 పరగణా జిల్లాలతో పాటు రాజధాని కోల్‌కత మీదుగా ఆయన ఏరియల్ సర్వే కొనసాగుతుంది. అనంతరం ఒడిశా బయలుదేరి వెళ్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. గజపతి, గంజాం, భద్రక్, కటక, పూరీ, నయాగఢ్, నవరంగ్ ‌పూర్, జగత్‌సింగ్ పూర్, బాాలాసోర్, మయూర్‌భంజ్, ఖుర్దా జిల్లాల్లో ఏరియల్ కొనసాగిస్తారు.

  Pawan Kalyan Slams AP Govt Over Sand Mafia In West Godavari

  అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్తారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ విభాగం, ఇతర అధికారులతో సమావేశమౌతారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తోన్న సమయంలో ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో ఫోన్ ద్వారా సంభాషిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాల్లో సంభవించిన నష్టానికి అనుగుణంగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది.'

  English summary
  Prime Minister Narendra Modi will travel to West Bengal and Odisha to take stock of the situation in the wake of Cyclone Amphan, today. He will conduct aerial surveys and take part in review meetings. Narendra Modi's last visit was to Prayagraj and Chitrakoot in Uttar Pradesh on February 29. PM Modi is going on a tour after 83 days.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more