వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుల్‌ బుల్ తుఫాను: బెంగాల్ ఒడిషాలకు పొంచి ఉన్న ముప్పు

|
Google Oneindia TeluguNews

ఒడిషా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు బుల్‌బుల్ తుఫాను రూపంలో ముప్పు పొంచి ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. బెంగాల్ బంగ్లాదేశ్‌ల మధ్య ఆదివారం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంగా గాలుల వీస్తాయని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో బుల్‌బుల్... అరేబియన్ సముద్రంలో మహా: భారత్‌ను వణికిస్తున్న తుఫాన్లుబంగాళాఖాతంలో బుల్‌బుల్... అరేబియన్ సముద్రంలో మహా: భారత్‌ను వణికిస్తున్న తుఫాన్లు

ప్రస్తుతం కోల్‌కతాకు దక్షిణాన 600 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఇక శనివారం కల్లా అది క్రమంగా ఉత్తరం వైపు కదులుతుందని చెప్పారు. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో గాలులు గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఇక తుఫాను ప్రభావంతో కచ్చా ఇళ్లు దెబ్బతింటాయని చెప్పిన అధికారులు, విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతింటాయని హెచ్చరించారు. రోడ్లు కూడా ధ్వంసం అవుతాయని చెప్పారు. భారీగా పంటనష్టం, చెట్లు విరిగిపడటం వంటివి జరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.

 Cyclone Bul Bul: Heavy rains to hit Odisha and Bengal

ఇక బుల్‌బుల్ తుఫాను ప్రభావం ఒడిషా రాష్ట్రంపై పడనుంది. ఆ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిషా తీరప్రాంతాలతో పాటు ఉత్తర జిల్లాల్లో కూడా రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఒడిషా తీరప్రాంతంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి 90 కిలోమీటర్ల వేగం పుంజుకునే అవకాశం ఉంది.

ఇక బుల్‌బుల్ తుఫాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పలు చోటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇదిలా ఉంటే నవంబర్ 9, 10వ తేదీల్లో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వెస్ట్ బెంగాల్ సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేయడం జరిగింది

English summary
The Met department said Cyclone Bulbul is likely to make landfall between West Bengal and Bangladesh in the early hours of Sunday, bringing in its wake heavy rain and gusts of up to 135 kmph in the coastal areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X