వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుల్‌బుల్ తుపాన్ ఎఫెక్ట్: 13 మంది మృతి, ఏడుగురు బెంగాల్ వాసులే.. దెబ్బతిన్న లక్ష ఇళ్లు..

|
Google Oneindia TeluguNews

బుల్ బుల్ తుపాన్ బెంగాల్, బంగ్లాదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 130 కిలోమీటర్ల గాలులు వీయడంతో భారీ ఆన్తి నష్టం వాటిల్లింది. ఇళ్ల పై కప్పులు ఎగిరిపోగా, భారీ వృక్షాలు సైతం నెలకొరిగాయి. తుపాన్ బీభత్సం సృష్టించింది. తుపాన్ మిగిల్చిన గాయంతో తీరప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.

13 మంది మృతి

13 మంది మృతి

బుల్ బుల్ తుపాన్ ధాటికి 13 మంది మృతిచెందారు. అధికారులు త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకోవడంతో మృతుల సంఖ్య తగ్గంది. మృతుల్లో ఆరుగురు బంగ్లాదేశ్‌కు చెందినవారు ఉన్నారు. భారీ వృక్షాలు నేలకొరిగి వీరు మృతిచెందారు. అందులో పునరావాస కేంద్రంలో ఉన్న 52 ఏళ్ల మహిళ కూడా ఒకరు ఉన్నారు. వాస్తవానికి ఆమె ఇంటికి వెళ్తుండగా ప్రమాద రూపంలో కబలించింది.

 30 మందికి గాయాలు..

30 మందికి గాయాలు..

మరొకరు 60 ఏళ్ల మత్య్సకారుడు అని అధికారులు తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు తరిలించే సమయంలో వచ్చేందుకు అతను నిరాకరించారని, అందుకోసం వృక్షాలు నెలకొరగడంతో చనిపోయాడని తెలిపారు. తుపాన్ ప్రభావంతో 30 మంది గాయపడ్డారు. 6 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయాని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. మరోవైపు రెండు బోట్లు ఇంకా తిరిగి రాలేదని స్థానికులు చెప్తున్నారు. అందులో 36 మంది ఉన్నారని.. వారి ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో పెద్దగా తుపాన్ ప్రభావం చూపలేదని అధికారులు చెప్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఎక్కువగా మయన్మార్ నుంచి వచ్చిన వారే ఉన్నారని తెలిపారు.

 ఏడుగురు బెంగాల్ వాసులే..

ఏడుగురు బెంగాల్ వాసులే..

తుపాన్ ప్రభావంతో భారత్‌లో ఏడుగురు చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. తుపాన్ తీరం దాటి, బలహీన పడిందని భారత వాతావరణ విభాగ అధికారులు తెలిపారు. కానీ మత్స్యకారులు మరో 12 గంటలపాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఆ తర్వాతే చేపల వేటకు వెళ్లాలని స్పష్టంచేశారు.

మమత ఏరియల్ సర్వే

మమత ఏరియల్ సర్వే

పశ్చిమబెంగాల్‌పై తుపాన్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఏడుగురు చనిపోగా.. దాదాపు లక్ష గృహలు దెబ్బతిన్నాయి. తుపాన్‌తో దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం మమతా బెనర్జీ సోమవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని స్పస్టంచేశారు. మరోవైపు బెంగాల్‌కు బాసటగా నిలుస్తామని ప్రధాని మోడీ కూడా హామీనిచ్చారు.

English summary
At least 13 people were killed in Bangladesh and India after cyclone Bulbul lashed coastal areas this weekend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X