వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగాళాఖాతంలో బుల్‌బుల్... అరేబియన్ సముద్రంలో మహా: భారత్‌ను వణికిస్తున్న తుఫాన్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

బుల్ బుల్ తుపాను ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం

న్యూఢిల్లీ: అరేబియన్ సముద్రంలో ఏర్పడిన మహా తుఫాను క్రమంగా గుజరాత్ వైపు కదులుతోంది. గురువారం సాయంత్రం కల్లా ఇది బలహీనపడుతుంది. ఆ సమయంలో గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు బంగాళా ఖాతంలో బుల్ బుల్ తుఫాను విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

గుజరాత్‌కు 'మహా'ముప్పు: బుధవారం తీరం తాకనున్న మహా తుఫానుగుజరాత్‌కు 'మహా'ముప్పు: బుధవారం తీరం తాకనున్న మహా తుఫాను

గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న మహా తుఫాను

గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న మహా తుఫాను

గురువారం ఉదయం వాతావరణ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత ఆరుగంటలుగా మహా తుఫాను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వెల్లడించింది. గుజరాత్‌లోని పోర్బందర్‌కు నైరుతి దిశలో 220 కిలోమీటర్ల దూరంలో ఉండగా , వేరవాల్‌కు 190 కిలోమీటర్ల దూరం, డియూకూ 230 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించింది. మహా తుఫాను తూర్పు ఈశాన్య గుజరాత్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న 12 గంటల్లో మహా తుఫాను బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది.

వర్షాలు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

వర్షాలు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఇక మహా తుఫాను గుజరాత్ తీరం దాటే సమయంలో పలు చోటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా , సౌరాష్ట్ర ఇతర గుజరాత్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని హెచ్చరించింది. డియూ, జునాగఢ్, గిర్ సోమ్‌నాథ్, ఆమ్రేలీ, భావ్‌నగర్, సూరత్, బరూచ్, ఆనంద్, పోర్బందర్, రాజ్‌కోట్‌లలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వెదర్ డిపార్ట్‌మెంట్. ఇక మహారాష్ట్రలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణశాఖ కొంకణ్ ప్రాంతం పాలగఢ్, థానే జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం కనిపిస్తుందని చెప్పింది. గుజరాత్ తీర ప్రాంతాల్లో తుఫాను కారణంగా ఒక్కింత నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 బంగాళాఖాతంలో తిష్ట వేసి ఉన్న బుల్ బుల్

బంగాళాఖాతంలో తిష్ట వేసి ఉన్న బుల్ బుల్

మరో వైపు బంగాళాఖాతంలో బుల్‌బుల్ తుఫాను కలవరపెడుతోంది. గత ఆరు గంటలుగా గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపు పయనిస్తోంది. తెల్లవారు జామున 2:30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో తిష్ట వేసి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో బుల్‌బుల్ తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుల్ ‌బుల్ తుఫాను ఉత్తర భారతదేశం వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలను తాకుతుందని వెల్లడించింది.

వెస్ట్‌బెంగాల్‌కు భారీ వర్ష సూచన

వెస్ట్‌బెంగాల్‌కు భారీ వర్ష సూచన


బుల్‌బుల్ తుఫాను తీరం దాటే సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణశాఖ. ఈ ప్రభావం ఒడిషాలో కూడా కనిపిస్తుందని అక్కడ కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నవంబర్ 9 నుంచి 10వ తేదీవరకు ఒడిషా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో వర్షాలు పడతాయని వెదర్ డిపార్ట్‌మెంట్ అంచనా వేస్తోంది. ఇక నవంబర్ 10వ తేదీ 11వ తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే బుల్‌బుల్ తుఫానుపై సమీక్షిస్తున్నామని అన్నిటికీ రాష్ట్రప్రభుత్వం సిద్ధ పడి ఉందని నవీన్ పట్నాయక్ సర్కార్ వెల్లడించింది.

English summary
he severe cyclonic storm Maha, which is currently over the Arabian Sea, is "very likely" to weaken into a depression by Thursday evening and the Cyclone Bulbul, which is over the Bay of Bengal, may intensify into a severe cyclonic storm during next 24 hours, the Indian Meteorological Department (IMD) said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X