వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ‌ల‌హీన‌పడ్డ ఫోనిః బెంగాల్ వైపు ప్ర‌యాణంః క్ర‌మంగా అల్ప‌పీడ‌నంగా!

|
Google Oneindia TeluguNews

భువ‌నేశ్వ‌ర్ః మూడు రాష్ట్రాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ ప్ర‌భంజ‌నం కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. పెను తుఫాన్ స్థాయి నుంచి సాధార‌ణ తుఫాన్ స్థితికి చేరుకుంది. క్ర‌మంగా ప‌శ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు క‌దులుతోంది. శ‌నివారం సాయంత్రానికి బంగ్లాదేశ్ తీరాన్ని తాక‌వ‌చ్చ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ డైరెక్ట‌ర్ తెలిపారు. ఈ లోగా తుఫాన్ మ‌రింత బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని, వాయుగుండంగా మారుతుంద‌ని వెల్ల‌డించారు. అయిన‌ప్ప‌టికీ- ఒడిశాపై ఫొని ప్ర‌భావం శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కూ కొన‌సాగుతుంద‌ని చెప్పారు. తుఫాన్ త‌రువాత కూడా ఒడిశాలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని చెప్పారు.

రంగంలో ఎన్డీఆర్ఎఫ్: జోరువానలోనూ సహాయక చర్యలు ముమ్మరంరంగంలో ఎన్డీఆర్ఎఫ్: జోరువానలోనూ సహాయక చర్యలు ముమ్మరం

నాలుగురోజులుగా ఏపీ, ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌ల‌ను ఈ తుఫాన్ నిద్ర ప‌ట్ట‌నివ్వ‌లేదు. స‌ముద్రంలో ఉన్నంత సేపూ ఉగ్ర‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించింది. పూరీ వ‌ద్ద తీరాన్ని దాటుతున్న స‌మ‌యంలో విల‌యాన్ని సృష్టించింది. గంట‌కు 180 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీయ‌డం వ‌ల్ల ఒడిశా స‌హా ఉత్తరాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లాల్లో వంద‌లాది చెట్లు నేలకు ఒరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ స‌హా, గంజాం, పూరీ, క‌ట‌క్‌, కేంద్ర‌పారా, గ‌జ‌ప‌తి, బ్ర‌హ్మ‌పూర్‌, న‌యాగ‌ఢ్ వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంతాల‌పై ఫొని తుఫాన్ తీవ్ర ప్ర‌భావాన్ని చూపింది.

 Cyclone Fani Has Started Weakening, Says IMD Chief

తీరాన్ని దాటిన త‌రువాత తుఫాన్ క్ర‌మంగా బ‌ల‌హీన ప‌డింది. పెను తుఫాను స్థాయి నుంచి సాధార‌ణ స్థితికి చేరుకుంది. ప‌శ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్ వైపు నెమ్మ‌దిగా క‌దులుతోంది. సాధార‌ణ తుఫానుగా మారిన అనంత‌రం ఫోని మరింత బ‌ల‌హీనప‌డి వాయుగుండంగా, ఆ త‌రువాత అల్ప‌పీడ‌నంగా రూపుదాల్చుతుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ డైరెక్ట‌ర్ తెలిపారు. ప్రస్తుతం తుఫాను కదలికలు పశ్చిమ బెంగాల్ వైపు సాగుతున్నాయని అన్నారు. క్రమంగా అది పశ్చిమ బెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్ వైపు వెళ్తుంద‌ని చెప్పారు.

English summary
Fani (pronounced Foni) has weakened from an ‘extremely severe’ to ‘very severe’ cyclonic storm, and is predicted to further weaken to a ‘severe storm’ in the next six hours, the India Meteorological Department (IMD) said. The story made landfall in Odisha this morning, which is on high alert with teams of the Army, Navy, Coast Guard and National Disaster Relief Force (NDRF) on standby for rescue and relief operations. Cyclone Fani has battered the coast of Odisha, uprooting trees and damaging buildings. Over one million people have been evacuated from coastal regions to shelters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X