వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైని వణికిస్తోన్న హికా తుఫాన్: అరేబియా సముద్రం అల్లకల్లోలం: అతి భారీ వర్షాలు!

|
Google Oneindia TeluguNews

ముంబై: రెండు నెలలుగా తరచూ భారీ వర్షాలతో అతలాకుతలమైన దేశ ఆర్థిక రాజధాని ముంబై.. మరోసారి ముప్పును ఎదుర్కొంటోంది.. హికా తుఫాన్ రూపంలో. అరేబియా సముద్రంలో ఏర్పడిన హికా తుఫాన్ ప్రభావం వల్ల ముంబై సహా మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

హికా తుఫాన్ క్రమంగా తన దిశను మార్చుకుని ఒమన్ వైపు ప్రయాణిస్తోందని, అయినప్పటికీ.. దాని ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోసారి ముంపు ముప్పు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్ తీర ప్రాంతాలపైనా హికా తుఫాన్ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

Cyclone ‘Hikaa’ intensifies, to cross Oman by Tuesday night, Severe thunderstorm currently over Mumbai

ఒమన్ వైపు హికా

అరేబియా సముద్రంలో ఆగ్నేయ దిశలో ఏర్పడిన హికా తుఫాన్ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోందని, ఒమన్ తీర ప్రాంత నగరం డక్మ్ సమీపంలో తీరాన్ని దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ దశ, దిశ మారినప్పటికీ.. దాని ప్రభావం తీవ్రంగా ఉందని అంచనా వేశారు. తుఫాన్ ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

అధికారుల అంచనాలను నిజం చేస్తూ బుధవారం తెల్లవారు జాము నుంచీ ముంబై, సమీప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, ముంబై సబర్బన్, పాల్ఘర్, అలీబాగ్, విరార్, భివండీ, కల్యాణ్, డొంబీవలి, డోంగ్రీ, బోరీవలి, గోరేగావ్, ములుంద్, పొవై, జుహు, దాదర్, బంద్రా, చెంబుర్, కొలాబా, నవీ ముంబై, కుర్లా, మీరా రోడ్, భయాందర్ లతో పాటు పొరుగునే ఉన్న థానే జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది.

Cyclone ‘Hikaa’ intensifies, to cross Oman by Tuesday night, Severe thunderstorm currently over Mumbai

ఇదిలావుండగా.. మహారాష్ట్ర సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు తెలగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ తూర్పు ప్రాంతం, విదర్భ, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లో గంగా నదీ తీర ప్రాంతాలు, అస్సాం, మేఘాలయ, మహారాష్ట్ర మధ్య ప్రాంతం, మరాఠ్వాడ, కొంకణ్, గోవా, కర్ణాటకల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

వచ్చే 12 లేదా 24 గంటల్లో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తూ ఓ బులెటిన్ ను విడుదల చేశారు.

English summary
Mumbaikars woke up to the heavy downpour on Wednesday morning with parts of the financial capital receiving heavy rains, creating road traffic and waterlogging in several parts of the city. Apart from Mumbai, Konkan-Goa, Marathwada, Vidarbha and Madhya Maharashtra are witnessing heavy rainfall today since early morning. Earlier in the morning, private weather forecast agency Skymet stated that intense rain will likely to continue in several parts of Mumbai for the next four to six hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X