వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైలిన్: ఊపిరి పీల్చుకున్నారు, పునరావాసం ఓ సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫైలిన్ తుఫాను పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫైలిన్ తగ్గుముఖం పట్టినందున అధికారులు నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించాలని కిరణ్ ఆదేశించారు. ఫైలిన్ తుఫాను ప్రభావం ఒరిస్సా పైన ఎక్కువగా పడింది. ఫైలిన్ తుఫాను ప్రభావం ఎంతో ఉంటుందని అందరు భయాందోళనకు గురయ్యారు. అయితే పెద్దగా ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఫైలిన్ తుఫాను వల్ల దాదాపు రూ.1400 కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లుగా ఒడిశా ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. తుఫాను తీవ్రతకు ఎడుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మన రాష్ట్రంలో ఫైలిన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా పడింది. నాలుగు మండలాల్లో భారీగా పంట నష్టం ఏర్పడింది.

cyclone moves northwards at 20kmph

ఇచ్చాపురం, కవిటీ, సోంపేట, పలాసలో ఆస్తి నష్టం సంభవించింది. ఇచ్ఛాపురం నుంచి బరంపురం వరకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. వరి, జీడి, కొబ్బరి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది.

ఐదో నెంబరు జాతీయ రహదారిపై చెట్టు విరిగిపడడంతో 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి, వాహనాలు నిలిచిపోయాయి.
జిల్లాలోని ఫైలిన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆదివారం కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, బాలరాజు, గంటా శ్రీనివాసరావు, శత్రుచర్ల విజయరామరాజు, కొండ్రు మురళి తదితరులు పర్యటించనున్నారు. జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

ఫైలిన్ తుఫాను ప్రభావం క్రమంగా బలహీనపడుతోంది. ఈ తుఫాను సాయంత్రానికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. దీని ప్రభావం మన రాష్ట్రం పైన ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఫైలిన్ తుఫాను కారణంగా అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ఎంవి బింగో అనే ఓ కార్గో ఓడ గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫైలిన్ తుపాను ఒరిస్సాలో నార్త్ వెస్ట్ దిశగా ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది.

కాగా, ఫైలిన్ తుఫాను ముప్పుపై ప్రభుత్వాలు త్వరగా అప్రమత్తమవడం వల్ల ప్రాణ నష్టాన్ని చాలా వరకు అరికట్ట కలిగినా ఆస్తినష్టం మాత్రం భారీగా జరిగింది. ఒడిశాలో తుఫాను కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది. దాదాపు పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇప్పుడు అందరికీ పునరావాస చర్యలు చేపట్టడమే తమ ముందున్న సవాలని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. ప్రజలను చైతన్యపర్చడంలో మీడియా పోషించిన పాత్ర అమోఘమన్నారు.

ఫైలిన్ పైన ప్రభుత్వం ప్రాథమిక అంచనా

ఫైలిన్ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ప్రాథమిక అంచనాను విడుదల చేసింది. తుఫాను వల్ల 7,500 హెక్టార్లలో వరి, మూడువేల హెక్టార్లలో కొబ్బరి, వందల హెక్టార్లలో మొక్కజొన్న, చెరకు, జీడి పంటలకు నష్టం వాటిల్లింది. కూరగాయలు, అరటిలకు వెయ్యి హెక్టార్లలో నష్టం వాటిల్లింది. 18 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. ముప్పైకి పైగా పశువులు మృతి చెందాయి.

శ్రీకాకుళం జిల్లాలో 18 ఇళ్లు పూర్తిగా, 53 పాక్షికంగా, విజయనగరంలో 8, విశాఖలో మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. నలభై వేలకు పైగా మత్సకారుల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. బాధితులకు పునరావాసం కల్పించాలని, బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

English summary
Cyclonic storm Phailin Saturday night slammed east coast near Gopalpur in Odisha, triggering heavy rains and strong winds with speed reaching up to 200 km an hour while more than 500,000 people were shifted to safety in coastal Odisha and AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X