• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Cyclone Nisarga:ఫోన్ ఫుల్ చార్జీ చేసి, గ్యాస్ కట్టేయండి, ముంబైకర్లకు బీఎంసీ పలు సూచనలు..

|

కరోనా వైరస్ దేశ ఆర్థిక రాజధాని ముంబైని చిన్నాభిన్నం చేసింది. 41 వేలకు పైగా పాజిటివ్ కేసులతో అల్లాడిపోతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు నిసర్గ తుఫాన్ వస్తోంది. బుధవారం మధ్యాహ్నం ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో గల అలిబాగ్ నుంచి తీరం దాటనుంది.

Cyclone Nisarga: ముంబైకి 110 కి.మీ వేగంతో వస్తున్న పెనుముప్పు, తీరంలో 144 సెక్షన్, హెచ్చరికలు జారీ

తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్‌పై ఉండగా.. ముంబైపై ఎక్కువ చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముంబైకర్లు ఏం చేయాలి..? ఏం చేయొద్దు అనే అంశాలపై బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూచనలు చేశారు. అవెంటో ఇప్పుడు చూద్దాం.

Cyclone Nisarga: Keep Mobile Phones Charged, Switch Off Gas Supply..

ఇలా చేయండి.

1. తుఫాన్‌కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే 1916కి కాల్ చేయాలని సూచన.

2. ఇంటి లోపల ఉండి.. మొబైల్స్, పవర్ బ్యాంక్స్ పూర్తిగా చార్జీ చేసుకోవాలి.

3. టార్చ్ లైట్ చార్జీ చేసి పెట్టుకొండి, క్యాండిల్స్ కూడా అందుబాటులో ఉంచుకొండి.

4. విద్యుత్ సరఫరాకు సంబంధించి మెయిన్ ఆఫ్ చేయండి, గ్యాస్ సఫ్లై కూడా ఆఫ్ చేయండి.

5. విలువైన డాక్యుమెంట్లు, జ్యువెల్లరీ, ఆభరణాలు ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి సీల్ వేయాలని సూచన.

6. కిటికీలకు దూరంగా కూర్చొండి. అలాగే కొన్ని తలుపులు మూసివేసి.. మరికొన్నింటినీ తెరవాలని సూచన. దీంతో గాలి వేగాన్ని నియంత్రించొచ్చు అని తెలిపిన సిబ్బంది.

7. ఇంటిలోపల మధ్యలో ఉండాలని.. కిటికీలు, కార్నర్ల వద్ద ఉంటే గాలి ఒత్తిడికి ఏదైనా వస్తువు పడే అవకాశం ఉంది అని హెచ్చరిక

8. ఇంటిలోపల ఉన్న ఫర్నీచర్, స్టూల్ లాంటి వస్తువులను తాడుతో కట్టాలని సజెస్ట్.

9. గాలి వీస్తున్న సమయంలో మిమ్మల్ని మీరు రక్షించేంుదకు తల, మెడపై చేతులను పెట్టుకోండి.

10. అత్యవసరం కానీ వస్తువులకు పవర్ సప్లై ఆపివేయండి.

11. ఇంట్లో గ్యాస్ లీక్ జరిగితే వెంటనే కిటికీలు తెరవాలని, భవనం నుంచి వెళ్లిపోవాలని సూచన. ఒకవేళ వీలుంటే గ్యాస్ కట్టేసి.. కంపెనీకి సమాచారం ఇవ్వండి.

12. ఇంట్లో విద్యుత్ వైర్లు డ్యామేజీకి గురైతే వెంటనే మెయిన్ పవర్ ఆఫివేయండి. ఎలక్ట్రిషీయన్‌కు ఫోన్ చేయండి.

ఇవీ చేయొద్దు..

1. తుఫాన్ సమయంలో వస్తోన్న రూమర్లను నమ్మొద్దు. భయపడకుండా ఇంట్లోనే ఉండాలి. ఇంతకంటే రక్షితమైన ప్లేస్ మరొటి లేదు.

  Supreme Court - 'Middle Seats On Flights Must Remain Vacant After June 6'

  2. తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని, వాహనం నడపొద్దని సూచన.

  3. ఒకవేళ ఇళ్లు దెబ్బతింటే... వెంటనే అందుల్లోంచి బయటకు రావాలని సూచన.

  4. తుఫాన్ ప్రభావం దృష్ట్యా.. ఎవరైనా గాయపడితే బయటకు తీసుకెళ్లొద్దు. ఎందుకంటే బయటకు వెళితే మరింత ప్రమాదం ఉండే అవకాశం.

  5. ఇంట్లో ఎలాంటి ఆయిల్ కిందపడిన, ఒలికిన వెంటనే శుభ్రపరచాలని సూచన.

  ఈ సూచనలను పాటిస్తూ.. తమను తాము తుఫాన్ నుంచి రక్షించుకోవాలని ప్రజలను బీఎంసీ కోరింది.

  English summary
  Mumbai's civic body Brihanmumbai Municipal Corporation has put out a list of dos and don'ts for citizens for Cyclone Nisarga precaution
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more