• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దూసుకొస్తున్న నివర్ తుపాను -ఏపీ, టీఎన్, పాండీల్లో హైఅలర్ట్ -పలు రైళ్లు రద్దు -ఇదీ తాజా సీన్

|

బ‌ంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం సోమవారం నాటికి క్ర‌మంగా నైరుతి బంగాళాఖాతం వైపు క‌దులుతూ తీవ్ర‌రూపం దాల్చింది. మ‌రో 24 గంట‌ల్లో ఈ తీవ్ర వాయుగుండం తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ప్రభావం చూపనుంది. నివర్ తుపానుగా పిలుస్తోన్న ఈ విపత్తు తాజా అప్ డేట్స్ ఇలా ఉన్నాయి..

  Cyclone Nivar : మరింత బలపడుతున్న ‘నివర్’ తుపాను.. ఏపీ, టీఎన్, పాండీల్లో హైఅలర్ట్!

  దుబాయ్ రాజుగారి ఆరో భార్య గుట్టు రట్టు -బాడీగార్డుతో ప్రిన్సెస్ హాయా అఫైర్ -అందుకు రూ.12కోట్లుదుబాయ్ రాజుగారి ఆరో భార్య గుట్టు రట్టు -బాడీగార్డుతో ప్రిన్సెస్ హాయా అఫైర్ -అందుకు రూ.12కోట్లు

  సోమవారం సాయంత్రం నాటికి చెన్నై తీరం నుంచి 480కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో మరింతగా బలపడనున్న నివర్.. పుదుచ్చేరి, త‌మిళ‌నాడు మ‌ధ్య‌లోని క‌రైకాల్‌, మామ‌ల్లాపురం మ‌ధ్య బుధవారం తీరాన్ని తాక‌నుంది. అయితే ఈప్రభావం వల్ల మంగళ, బుధ, గురువారాల్లో మూడు రాష్ట్రాల్లోనూ విస్తారమైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.

  Cyclone Nivar: Tamil Nadu, Andhra on high alert, trains, buses cancelled, key points

  ఇప్పటికే ఈ వాయిగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తమిళనాడు ఉత్తర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. కొన్ని చోట్ల సాధారణ వర్షాలు మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర‌్షాలు పడనున్నాయి. తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. చేపల వేటకు వెళ్ళవద్దని ఆదివారం నుంచే మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

  చంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రంచంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రం

  నివర్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తమిళనాడులోని ఏడు జిల్లాల్లో బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. అదే సమయంలో ఆరు రైళ్లను పూర్తిగా, తొమ్మిది రైళ్లను తాత్కాలికంగా నిలిపేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.

  నివార్ తుఫాను దృష్ట్యా మూడు రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగం, ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వీరికి సహాయంగా ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 12 బృందాలు కూడా మోహరించి ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లో కలిపి అదనంగా మరో 18 ఎన్డీఆర్ఎఫ్ టీమల్ లను స్టాండ్‌బైలో ఉంచారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.

  English summary
  Tamil Nadu, Andhra Pradesh and Puducherry are on high alert as Cyclone Nivar is expected to make landfall in the region on the afternoon of November 25. The depression over the Bay of Bengal is likely to intensify into a cyclonic storm by Tuesday and cross the coast as a severe cyclonic storm a day after.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X