వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నివర్ బీభత్సం: ఇసుక బస్తాలతో అణు కేంద్రానికి రక్షణ - తీర జిల్లాల్లో 144 సెక్షన్ -ఇదీ తాజా సీన్

|
Google Oneindia TeluguNews

తీరం దాటడానికి 24 గంటల ముందే నివర్ తుపాను బీభత్సాన్ని సృష్టిస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపాను‌గా కొనసాగుతుండగా, దాని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నది. తమిళనాడు, పుదుచ్చేరిలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సిటీలో మంగళవారం మధ్యాహ్నం అతి భారీ వర్షం కురవగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయి చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో జనజీవనం దాదాపు స్థంభించింది. నివర్ తుపానుకు సంబంధించిన తాజా అప్ డేట్స్ ఇలా ఉన్నాయి..

 వ్యాక్సిన్ వేసుకున్నా కొవిడ్-19వ్యాధి? -సమర్థత, సరఫరాపై గందరగోళం -ఈ ప్రశ్నలకు బదులేది? వ్యాక్సిన్ వేసుకున్నా కొవిడ్-19వ్యాధి? -సమర్థత, సరఫరాపై గందరగోళం -ఈ ప్రశ్నలకు బదులేది?

145 కి.మీ వేగంతో గాలులు..

145 కి.మీ వేగంతో గాలులు..


బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్ తుపాను.. మంగళవారం సాయంత్రం నాటికి.. పుదుచ్చేరి తీరానికి తూర్పు ఆగ్నేయ దిశగా 380 కి.మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయ దిశగా 430 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. బుధవారం (నవంబర్ 25) సాయంత్రం 5 గంటల నాటికి ఇది.. అతి తీవ్ర తుపానుగా మారి.. పుదుచ్చేరికి సమీపంలో కరైకల్‌ - మహాబలిపురం (తమిళనాడు) మధ్య తీరం దాటే అవకాశం ఉంది. నివర్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కి.మీ నుంచి 130 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గాలుల వేగం గరిష్ఠంగా 145 కి.మీ వరకు ఉండొచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే..

షాకింగ్: ఆస్పత్రిలో ఎంపీ రఘురామ -గుండెలో బ్లాక్స్ -ముంబైలో చికిత్స -ప్రవీణ్, సాయిరెడ్డిపై ఫైర్షాకింగ్: ఆస్పత్రిలో ఎంపీ రఘురామ -గుండెలో బ్లాక్స్ -ముంబైలో చికిత్స -ప్రవీణ్, సాయిరెడ్డిపై ఫైర్

అణు కేంద్రంలో అప్రమత్తత..

అణు కేంద్రంలో అప్రమత్తత..

నివర్ తుపాను తీరం దాటనున్న ప్రాంతానికి చేరువలోనే కల్పకం అణు విద్యుత్ ప్లాంటు ఉండటంతో దాని భద్రతపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ (మాప్స్)గా పిలిచే ఈ అణు కేంద్రం సామర్థ్యం 440మెగావాట్లు. ఇక్కడి రెండు యూనిట్లలో మొదటిది మెయింటెనెన్స్ లో ఉండగా, రెండో యూనిట్ లో మంగళవారం నాటికి పూర్తిస్థాయిలో(220 మెగావాట్ల) విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. నివర్ అతి తీవ్ర తుపానుగా తీరం దాటనుండటంతో ముందు జాగ్రత్త చర్యగా అణు కేంద్రానికి సమీపంలోని తీరానికి అడ్డంగా భారీ ఎత్తున ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. తద్వారా సముద్రం ముందుకు చొచ్చుకొని వచ్చినా, ఆ నీరు ప్లాంటులోనికి రాకుండా అడ్డుకట్ట వేసినట్లవుతుందని అధికారులు చెప్పారు. ‘‘సాధారణంగా ఎంత పెద్ద తుపానునైనా తట్టుకునే సామర్థ్యం అణు విద్యుత్ ప్లాంటుకు ఉంది. అయితే, ఏమాత్రం పొరపాటుకు తావు ఇవ్వకుండా తుపాను రక్షణ ప్రక్రియలను అవలంభిస్తున్నాం''అని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్( IGCAR) డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ చెప్పారు. మరోవైపు..

పొజిషన్‌లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..

పొజిషన్‌లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..

ముంచుకొస్తున్న నివ‌ర్ తుపాను ముప్పును ఎదుర్కోడానికి అంతా సిద్ధం చేశఆమని నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్(డీజీ) ఎస్ఎన్ ప్ర‌ధాన్ మంగళవారం మీడియాకు తెలిపారు. తుపాను వల్ల జరిగే నష్టాన్ని తగ్గించడం కోసం మొత్తం 30 ఎన్డీఆర్ఎఫ్ బృందాల‌ను రంగంలోకి దించుతున్నామని, ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో 12 బృందాలు, పుదుచ్చేరిలో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయ‌ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నెల్లూరులో మూడు, చిత్తూరులో ఒకటి, విశాఖ‌ప‌ట్నంలో మ‌రో మూడు చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పొజిష‌న్ తీసుకున్నాయని, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎక్క‌డ అవ‌స‌ర‌మైతే అక్క‌డికి త‌ర‌లించ‌డానికి మ‌రో 8 బృందాలను సిద్ధం చేసి ఉంచామ‌ని ప్ర‌ధాన్ వివ‌రించారు. తీవ్ర తుపాను నేపథ్యంలో..

టెన్షన్‌లో ముగ్గుసు సీఎంలు..

టెన్షన్‌లో ముగ్గుసు సీఎంలు..

నివర్ అతి తీవ్ర తుపానుగా తీరం దాటనుండటంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పళనిస్వామి, వైఎస్ జగన్, నారాయణస్వామిలు క్షణం తీరిక లేకుండా తుపాను పరిస్థితులను సమీక్షిస్తూ, అధికారులకు సూచనలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మూడు రాష్ట్రాల సీఎంలతో టచ్ లో ఉండి, అవసరమైన సూచనలు చేస్తున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో మంగళవారం నుంచే భారీ వర్షాలు కురుస్తుండగా, ఏపీలో బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నివర్ తీరం దాటబోయే కరైకల్‌, పుదుచ్చేరి జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించినట్లు కలెక్టర్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి.

Recommended Video

Cyclone Nivar : మరింత బలపడుతున్న ‘నివర్’ తుపాను.. ఏపీ, టీఎన్, పాండీల్లో హైఅలర్ట్!
ఏపీ, తెలంగాణలో ప్రభావిత జిల్లాలు..

ఏపీ, తెలంగాణలో ప్రభావిత జిల్లాలు..


నివర్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, నెల్లూరు ,చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే కురుస్తాయని తెలిపింది. నివర్ వల్ల అటు తెలంగాణలోనూ బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గురువారం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

English summary
Unit II at the Madras Atomic Power Station (MAPS) in neighbouring Kalpakkam was operating at full capacity of 220MW and all the systems were expected to 'successfully' withstand the impact of Cyclone 'Nivar' when it crosses the eastern coast, a top official said on Tuesday. Thirty teams of the National Disaster Response Force (NDRF) have been pressed into action across Tamil Nadu, Andhra Pradesh, and Puducherry as Cyclone Nivar moves towards the southern coast of India, NDRF informed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X