వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటకు 145 కి.మీ వేగంతో గాలులు, భారీ వర్షం.. నీవర్ టెన్షన్..టెన్షన్

|
Google Oneindia TeluguNews

నీవర్ తుఫాన్ తీవ్రంగా మారనుంది. ఇవాళ సాయంత్రం తమిళనాడులో గల మమల్లపురం వద్ద తీరం దాటనుంది. ఇదీ చెన్నైకి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుదుచ్చేరిలోని కరైకల్ వద్ద నుంచి కూడా తీరం దాట నుంది. అయితే ఆ సమయంలో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Recommended Video

#NivarCyclone : Mamallapuram వద్ద తీరం దాటనున్న నీవర్ , భారీగా ఈదురుగాలులు... భారీ వర్షాలు...!

తుపాన్ ప్రభావంతో కోస్తా తీరప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గురువారం వరకు వర్షం కొనసాగుతోందని తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ ఆదేశించారు. ఈ మేరకు ఇరురాష్ట్రాల సీఎంలు పళనిస్వామి, వీ నారాయణ స్వామితో ఆయన మాట్లాడారు. కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాలో ఉంటోన్న వారు బాగుండాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. తుపాన్ దృష్ట్యా ఇరు రాష్ట్రాలు బుధవారం హాలీడేగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Cyclone Nivar To Slam Tamil Nadu, Puducherry, Winds Up To 145 Kmph

తుపాన్ దృష్ట్యా రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ప్రజలు గుమిగూడి ఉండటంపై నిషేధం విధించామని పుదుచ్చేరి సీఎం మీడియాకు తెలిపారు. అత్యవసరం కానీ షాపులు/ సేవలను ఇప్పటికే నిలిపివేశారు. పాలు/ చమురు/ ఆస్పత్రి/ మందుల షాపులు మాత్రమే తెరచుకుంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఓపెన్ చూసి ఉంచుతారు. అత్యవసర సేవల్లో ఉన్నవారు తమ విధులను కంటిన్యూ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రంలో ప్రభావిత ప్రాంతాలు 4 వేలకు పైగా ఉన్నాయని.. ప్రజలు ఇంట్లోనే ఉండాలని సీఎం పళని స్వామి కోరారు.

English summary
Tamil Nadu Chief Minister Palaniswami appealed to people to stay indoors as far as possible and said over 4,000 "vulnerable" locations had been identified.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X