వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా వైపు దూసుకొస్తున్న ఫైలిన్, ముందుకు సముద్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫైలిన్ తుఫాను ఆంధ్రా తీరం వైపు దూసుకు వస్తోంది. కళింగ పట్నానికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. కళింగపట్నం వద్ద సముద్రపు అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. నలభై అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది.

దీంతో అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫైలిన్ తుఫాను రేపు సాయంత్రం నుండి రాత్రి మధ్య పారాదీప్-కళింగపట్నం మధ్య గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశముంది.

Cyclone Phailin: 215 km h wind speed, 3m storm surge at landfall

ఫైలిన్ తుఫాను ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. తీరం సమీపించే కొద్ది అది బలపడనుంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు విపత్తు బృందాలను కేంద్రం తరలించింది. కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయ ప్రాంతంలో ఫైలిన్ తుఫాను కేంద్రీకృతమై ఉంది.

తుఫాను తీరం దాటే సమయంలో గంటకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. ఫైలిన్ తుఫాన నేపథ్యంలో కళింగపట్నం, భీమిలి, విశాఖ, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు సూచించారు.

English summary

 Odisha government cancels Durga Puja holidays of government employees. Chief Minister Naveen Patnaik has sought the help of defence forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X