వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైలిన్ భయానకం: నీళ్లలోకి జారుతున్నట్లుగా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫైలిన్ తుఫాను అల్లకల్లోలం సృష్టించింది. ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద తీరం దాటిన భయానక తుఫాను తీరప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో కూకటివేళ్లతో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. శ్రీకాకుళం, ఒరిస్సా రాష్ట్రాలపై అధిక ప్రభావం పడింది.

ఫైలిన్ ప్రభావంతం తీర ప్రాంత గ్రామాలు శనివారం రాత్రి అంధకారంలో మునిగిపోయాయి. ఏడు లక్షల మందికి పైగా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో ఫైలిన్ తీరం దాటింది. ఆదివారం సాయంత్రం వరకు తుఫాను ప్రభావం ఉంటుంది.

ఫైలిన్ తుఫాను కారణనంగా విశాఖ, భువనేశ్వర్‌లలో విమానాలు రద్దయ్యాయి. ఒరిస్సా వెళ్లే అన్ని రైళ్లు రద్దయ్యాయి. ఫైలిన్ ప్రభావం కారణంగా రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో అలలు ఐదు మీటర్లకు పైగా ఎగిసిపడ్డాయి.

రఘువీరా రెడ్డి

రఘువీరా రెడ్డి

ఫైలిన్ తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటిస్తున్న మంత్రి రఘువీరా రెడ్డి. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఫైలిన్ ప్రభావం ఒరిస్సాతో పాటు మన రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాపై అధికంగా పడింది.

ఫైలిన్ 2

ఫైలిన్ 2

తుఫాను తీరం దాటుతున్నప్పుడు ముందుగా అంచనా వేసినట్టుగానే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గంటకు 200 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. విశాఖ తీర ప్రాంతంలో దృశ్యం.

ఫైలిన్ 3

ఫైలిన్ 3

అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్నిచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. అనేక మండలాల్లో గ్రామాలకు గ్రామాలనే ఖాళీ చేయాల్సి వచ్చింది.

ఫైలిన్ 4

ఫైలిన్ 4

తుఫాను తీరం దాటినా ఆరు గంటలపాటు అదే తీవ్రత కొనసాగుతుందని, ఆదివారం సాయంత్రం వరకూ తుఫాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

ఫైలిన్ 5

ఫైలిన్ 5

ఫైలిన్ తుఫాను కారణంగా ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు 18 హెలికాప్టర్లు, 12 విమానాలు, 2 యుద్ధ నౌకలను సిద్ధంగా ఉంచామని హోం శాఖ తెలిపింది.

ఫైలిన్ 6

ఫైలిన్ 6

ఉత్తర కోస్తా, ఒడిసాలను గడగడలాడించిన ఫైలిన్ తుఫాను శనివారం రాత్రి తీరాన్ని దాటింది. బంగాళాఖాతం నుంచి వాయవ్యంగా పయనించి రాత్రి 11 గంటల సమయంలో ఒడిసాలోని గంజాం జిల్లా గోపాల్‌పూర్ సమీపంలో తీరాన్ని తాకింది.

ఫైలిన్ 7

ఫైలిన్ 7

అర్ధరాత్రి పన్నెండు సమయంలో ఫైలిన్ తుఫాను తీరాన్ని దాటినట్టు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారి ఒకరు ఈ సందర్భంగా తెలిపారు.

ఫైలిన్ 8

ఫైలిన్ 8

తుఫాను తీరం దాటుతున్నప్పుడు ముందుగా అంచనా వేసినట్టుగానే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గంటకు 200 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి.

ఫైలిన్ 9

ఫైలిన్ 9

శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో 220 నుండి 230 కిలో మీటర్ల వరకు; విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో 100-110 కి.మీ., ఒక్కొక్కసారి గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు వీసాయి. తీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న దృశ్యం.

ఫైలిన్ 10

ఫైలిన్ 10

తుఫాను ప్రభావానికి శ్రీకాకుళం జిల్లాతోపాటు ఒడిసాలోని పూరీ, కుర్దా, కేంద్రపడ, జగత్సింగ్‌పూర్, గంజాం తదితర జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి.

ఫైలిన్ 11

ఫైలిన్ 11

ఫైలిన్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుపాను ప్రభావంతో విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినా అంత కురవలేదు.

ఫైలిన్ 12

ఫైలిన్ 12

శనివారం విశాఖ పోర్టులో కంట్రోల్ రూంను మూసివేశారు. విశాఖ బీచ్ రోడ్డును పూర్తిగా మూసివేశారు. భారీ పోలీస్ బంద్ బస్త్ ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలను నిషేధించారు.

ఫైలిన్ 13

ఫైలిన్ 13

రాష్ట్రంలో ప్రభావిత ప్రాంతాల బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. దెబ్బతిన్న విద్యుత్, రహదారుల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.

ఫైలిన్ 14

ఫైలిన్ 14

ఫైలిన్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుపాను ప్రభావంతో విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినా అంత కురవలేదు.

ఫైలిన్ 15

ఫైలిన్ 15

శ్రీకాకుళంతోపాటు ఒడిసా రాజధాని భువనేశ్వర్ సహా ఏడు తీర ప్రాంత జిల్లాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. దీంతో, ఆయా ప్రాంతాల్లో పూర్తి అంధకారం నెలకొంది. టవర్లు కూలిపోవడంతో టెలిఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మొబైల్ ఫోన్లతోపాటు ల్యాండ్‌లైన్లు కూడా మూగనోము పట్టాయి. పంటలకు అపార నష్టం వాటిల్లింది. రహదారి వ్యవస్థ చిన్నాభిన్నమైంది. విద్యుత్తు, సమాచార వ్యవస్థలు నాశనమయ్యాయి.

ఫైలిన్ 16

ఫైలిన్ 16

ఫైలిన్ తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఎగిసి పడుతుండటంతో తీరప్రాంత వాసులు హడలిపోతున్నారు. శనివారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా కోట మండలం గోవిందుపల్లిపాళెం వద్ద సముద్రపు కెరటాలు భీకర ధ్వనులు చేస్తూ సుమారు వంద అడుగులు ముందుకు వచ్చింది.

ఫైలిన్ 17

ఫైలిన్ 17

అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్నిచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. అనేక మండలాల్లో గ్రామాలకు గ్రామాలనే ఖాళీ చేయాల్సి వచ్చింది.

ఫైలిన్ 17

ఫైలిన్ 17

శనివారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా కోట మండలం గోవిందుపల్లిపాళెం వద్ద సముద్రపు కెరటాలు భీకర ధ్వనులు చేస్తూ సుమారు వంద అడుగులు ముందుకు వచ్చింది.

ఫైలిన్ 18

ఫైలిన్ 18

పడవలు, వలలు కొట్టుకుపోకుండా మత్స్యకారులు వాటిని ఒడ్డుకు తీసుకువచ్చారు. కొత్తపట్నం, శ్రీనివాససత్రం, యమదినే్నపాళెం, గున్నంపడియ గ్రామాల్లో మత్య్సకారులు అధికారుల ఆదేశాలతో మూడు రోజులుగా వేటకు వెళ్లలేదు.

ఫైలిన్ 19

ఫైలిన్ 19

మునుపెన్నడూ చూడని విధంగా సముద్రపు కెరటాలు 20 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతూ సముద్రం సుమారు వంద అడుగుల మేరకు ముందుకు రావడంతో తీరప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

పైలిన్ 20

పైలిన్ 20

బంగాళాఖాతంలో ఫైలిన్ తుపాను కారణంగా నెల్లూరు జిల్లా కోడూరు తీర ప్రాంతంలో శనివారం అలల ఉద్రిక్తత అధికంగా ఉంది. మత్స్యకారులను అప్రమత్తం చేసారు.

ఫైలిన్ 21

ఫైలిన్ 21

వెంకన్నపాలెం, ముత్యాలతోపు, వెంకటేశ్వరపాలెం, నడింపాలెం, కొత్తపట్టపుపాలెం, పాతపట్టపుపాలెం, రవీంద్రపురం, రాజీవ్‌కాలనీలో పర్యటించి స్థానికులకు తుపాను హెచ్చరికలు తెలిపారు.

ఫైలిన్ 22

ఫైలిన్ 22

ఫైలిన్ తుఫాన్ ప్రభావం కారణంగా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇస్కపల్లి తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువై తీరంలో అలజడి నెలకొంది.

ఫైలిన్ 23

ఫైలిన్ 23

ఫైలిన్ తుఫాన్ ప్రభావం కారణంగా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇస్కపల్లి తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువై తీరంలో అలజడి నెలకొంది.

ఫైలిన్ 24

ఫైలిన్ 24

ఫైలిన్ తుఫాన్ ప్రభావం కారణంగా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇస్కపల్లి తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువై తీరంలో అలజడి నెలకొంది. ఓ ప్రాంతంలో తీరం కొట్టుకుపోయి భయానకంగా ఉన్న ఇంటి దృశ్యం.

ఫైలిన్ 25

ఫైలిన్ 25

ఫైలిన్ తుఫాన్ ప్రభావం కారణంగా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇస్కపల్లి తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువై తీరంలో అలజడి నెలకొంది. ఓ ప్రాంతంలో తీరం కొట్టుకుపోయి భయానకంగా ఉన్న ఇంటి దృశ్యం.

ఫైలిన్ 26

ఫైలిన్ 26

శనివారం 50 మీటర్లు ముందుకు సముద్రపు అలలు ఎగిసిపడటంతో కట్టలు కోసుకుపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తీరంలో అలజడి కనిపించిందని మత్స్యకారులు తెలిపారు.

ఫైలిన్ 27

ఫైలిన్ 27

విశాఖపట్నం, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో అన్ని విమానాలను రద్దు చేశారు. విశాఖపట్నం - హౌరా మధ్య నడిచే అన్ని రైళ్లను రద్దు చేశారు.

ఫైలిన్ 28

ఫైలిన్ 28

హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో దక్షిణ మధ్య రైల్వే కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది. ఒడిసా, ఆంధ్రప్రదేశ్‌లకు 55 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు.

ఫైలిన్ 29

ఫైలిన్ 29

ఫైలిన్ తుఫానుతో తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోతోంది. సమాచార వ్యవస్థ తెగిపోవడం, అటు ఒడిసాలోనూ.. ఇటు రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోనూ పూర్తి అంధకారం నెలకొనడం, రాత్రంతా భారీ వర్షం కురుస్తుండటంతో ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదు.

ఫైలిన్ 30

ఫైలిన్ 30

అటు ఒడిసాలోనూ ఇటు శ్రీకాకుళంలో కూడా ప్రజలను భారీగా తరలించడం, ఇరు ప్రభుత్వాలూ ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణ నష్టం తక్కువగా జరిగింది.

ఫైలిన్ 31

ఫైలిన్ 31

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పైలిన్ 32

పైలిన్ 32

దేశం మొత్తంమీద గత 23 ఏళ్లలో ఇదే అతి పెద్ద తరలింపు అని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం మరోసారి తీవ్రంగా నష్టపోయింది.

ఫైలిన్ 33

ఫైలిన్ 33

ఫైలిన్ తుపాను తీవ్రతకు మండలంలోని సముద్ర తీర గ్రామాలలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో తీరప్రాంత ప్రజలు భయాందోళనలతో వణికారు.

ఫైలిన్ 34

ఫైలిన్ 34

తూర్పుగోదావరి జిల్లాలో శనివారం సాయంత్రం నుండి సుబ్బంపేట, ఉప్పాడ, కోనపాపపేట గ్రామాలలో అలలు ఎగిసిపడ్డాయి. ఉప్పాడ శివారు కొత్తపట్నం నుండి సుబ్బంపేట వరకూ స్పెక్ట్రం విద్యుత్ ప్లాంట్ సమీపంలో బీచ్ రోడ్డుపై కెరటాలు ఎగసిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఫైలిన్ 35

ఫైలిన్ 35

ఉప్పాడ శివారు కొత్తపట్నం నుండి సుబ్బంపేట వరకూ స్పెక్ట్రం విద్యుత్ ప్లాంట్ సమీపంలో బీచ్ రోడ్డుపై కెరటాలు ఎగసిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

పైలిన్ 36

పైలిన్ 36

ఫైలిన్ తుఫానుతో తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోతోంది. సమాచార వ్యవస్థ తెగిపోవడం, అటు ఒడిసాలోనూ.. ఇటు రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోనూ పూర్తి అంధకారం నెలకొంది.

English summary
Cyclonic storm Phailin Saturday night slammed east coast near Gopalpur in Odisha, triggering heavy rains and strong winds with speed reaching up to 200 km an hour while more than 500,000 people were shifted to safety in coastal Odisha and Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X