వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తౌక్తే తుఫాన్ ఎఫెక్ట్: మహారాష్ట్రలో ఆరుగురు మృతి..

|
Google Oneindia TeluguNews

తౌక్తే సైక్లోన్ గుజరాత్ తీరాన్ని తాకింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సౌరాష్ట్ర వద్ద గల డియు తీరం వద్ద సోమవారం రాత్రి తుఫాన్ తీరాన్ని తాకింది. దీంతో ముంబైలో భారీ వర్షాలు కురిసాయి. గుజరాత్'లో 2 లక్షల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

తుఫాన్ తీరం దాటే సమయంలో డయ్యి వద్ద 133 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయి. రాత్రి 9.30 గంటల సమయంలో తుఫాన్ తాకింది. 23 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో గుజరాత్‌లో తుఫాన్ వచ్చింది. తుపాన్ వల్ల అహ్మదాబాద్, సూరత్ ఎయిర్ పోర్టులను క్లోజ్ చేశారు. గుజరాత్ కు ఎలాంటి సాయమైనా అందజేస్తామని కేంద్రం తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు గుజరాత్ సీఎం పర్యవేక్షిస్తున్నారు. వారితో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఇంటరాక్ట్ అవుతున్నారు.

Cyclone Tauktae makes landfall: 6 dead in Maharashtra

Recommended Video

Cyclone Tauktae 2021 Reach Gujarat Coast On Monday Evening | Oneindia Telugu

మహారాష్ట్ర, గోవాపై కూడా తుపాన్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ముంబైలో 114 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో ఆరుగురు చనిపోయారు. వేటగాళ్లు కూడా కనిపించకుండా పోయారు. వారి బోటు కనిపించడం లేదు. ఇటు రాయ్ గడ్‌లో ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

English summary
extremely severe cyclonic storm 'Tauktae', with winds gusting up to 185 km per hour, began making landfall on Gujarat's Saurashtra coast near Diu on Monday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X