వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Tauktae: ముంబై నిండా భారీ వర్షాలు: తీరం అల్లకల్లోలం

|
Google Oneindia TeluguNews

ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్.. ఇక మహారాష్ట్ర, గుజరాత్‌లను వణికిస్తోంది. గుజరాత్ వైపు కదులుతోన్న ఆ తుఫాన్ ప్రభావానికి మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాలన్నీ అల్లకల్లోలమౌతోన్నాయి. ముంబై సహా పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయియ. మంగళవారం తెల్లవారు జామున ఈ తుఫాన్ గుజరాత్ తీరాన్ని తాకబోతోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా తీరాన్ని ముంచెత్తిన తౌక్టే తుఫాన్..ప్రభావం తాజాగా మహారాష్ట్ర, గుజరాత్‌‌పై పడింది. తీరం వైపు కదులుతున్న కొద్దీ దాని తీవ్రత మరింత అధికమౌతోంది. ముంబై వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది.

Recommended Video

Cyclone Tauktae 2021 Reach Gujarat Coast On Monday Evening | Oneindia Telugu

సంక్షోభం వేళ..మోడీ సర్కార్‌కు బిగ్ షాక్: కోవిడ్ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ రాజీనామాసంక్షోభం వేళ..మోడీ సర్కార్‌కు బిగ్ షాక్: కోవిడ్ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ రాజీనామా

ముంబైలో భారీ వర్షాలు..

ముంబైలో భారీ వర్షాలు..

ఈ తెల్లవారు జామున 5:30 గంటల సమయానికి తౌక్టే తుఫాన్ 18.5ఎన్/71.6ఈ అక్షాంశ, రేఖాంశాల వద్ద కేంద్రీకృతమైనట్లు వాతవరణ కేంద్రం వెల్లడించింది. ఇది మరింత తీవ్రంగా మారిందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ తెల్లవారు జాము నుంచి ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. ఈ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ముంబైలు చెట్లు నేలకూలాయి. పశ్చిమ సబర్బన్ ప్రాంతంలో 11, తూర్పు సబర్బన్‌లో 17 చెట్లు నేలకూలినట్లు బహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. నగరం వ్యాప్తంగా రెడ్ అలర్ట్‌ను చేసింది.

మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో

మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో

తుఫాన్ ప్రభావంతో కొంకణ్ ఉత్తర ప్రాంతం, రాయగఢ్, థానె, పాల్‌ఘర్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావం అంచనాకు మించి ఉంటోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు రాయగఢ్‌ జిల్లాను వణికిస్తోన్నాయి. ముందుజాగ్రత్త చర్యగా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం తీర ప్రాంతాలను ఖాళీ చేయించింది. తీర ప్రాంత వాసులను పునరావాస శిబిరాలకు తరలించింది. పలు చోట్ల జాతీయ, రాష్ట్రస్థాయి ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలను మోహరింపజేసింది.

పుణే జిల్లాపైనా

పుణే జిల్లాపైనా

పుణే జిల్లాపైనా తుఫాన్ ప్రభావం కనపించింది. జిల్లాలోని ఖేడ్ తహశీల్ పరిధిలోని భోర్‌గిరి, భివేగావ్‌లల్లో ఈదురుగాలుల ధాటికి 70 నివాసాలు ధ్వంసం అయ్యాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల పైకప్పులు కూలిపోయాయి. పూరి గుడిసెలు చెల్లాచెదరు అయ్యాయి. అటు గుజరాత్‌లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ గుజరాత్‌లో ఈదురుగాలు తీవ్రత అధికమౌతోంది. జునాగఢ్ జిల్లా తీర ప్రాంతాలన్నీ ఖాళీ అయ్యాయి.

 గుజరాత్‌లో తీర గ్రామాలు ఖాళీ..

గుజరాత్‌లో తీర గ్రామాలు ఖాళీ..

తీరానికి సమీపంలో ఉన్న మలియా గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. తీర ప్రాంతాలకు చెందిన 1200 మందిని వారిని పునరావాస శిబిరాలకు తరలించినట్లు జునాగఢ్ జిల్లా కలెక్టర్ సౌరభ్ పర్ధీ తెలిపారు. తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. జునాగఢ్ వద్ద సముద్రం ముందుకు చొచ్చుకుని వస్తోందని, వచ్చే 24 గంటల వ్యవధిలో జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసినట్లు పేర్కొన్నారు.

English summary
The state will witness the impact of cyclone Tauktae as heavy to very rainfall in a few places has been forecast over Maharashtra coastal areas. Tauktae started pouring rains in Mumbai. Rain and gusty winds seen in Mumbai streets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X