శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాకుళంలో తీరం దాటిన టిట్లీ: భారీ గాలులు, వర్షాలు, ఎగిసిపడిన అలలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Cyclone Titli Crossed Shore At Vajrapukotturu In Srikakulam

శ్రీకాకుళం/ఒడిశా: ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీరాలను వణికిస్తున్న టిట్లీ తుఫాను గురువారం వేకువజామున గం.4.40 నిమిషాలకు శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటింది. జిల్లాలోని వజ్రకొత్తూరు మండలం గొల్లపాడు వద్ద తీరం దాటింది. గంటకు 14 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న పెను తుఫాను ముందుకు కదిలి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు దిశ మార్చుకుంటోందని వాతావరణ శాఖ తెలిపింది.

 శ్రీకాకుళంలో భారీ వర్షాలు

శ్రీకాకుళంలో భారీ వర్షాలు


టిట్లీ తుఫాను నేపథ్యంలో తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇచ్చాపురం, కవిటి, కంచిలి, మందస, సోంపేట, పలాస, నందిగమ్, టెక్కలి, సంతబొమ్మాలి, వజ్రపుకొత్తూరు, పోలకి, గారా, ఎచ్చెర్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలాస, వజ్రపుకొత్తూరులో కాజు పంటపొలాలకు నష్టం జరిగాయి. కవిటి, కంచిలి, సోంపేట మండలాలలో భారీ ఈదురు గాలుల కారణంగా కొబ్బరితోటలకు నష్టం జరిగింది.

126 కిలో మీటర్ల వేగంతో గాలులు

పలు మండలాల్లో భారీ ఈదురు గాలులతో, వర్షబీభత్సం కొనసాగుతోంది. కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గాలులు గంటకు 126 కిలో మీటర్లకు, అంతకు మించి వేగంతో వీస్తున్నాయి. సాయంత్రం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. రెండు కిలో మీటర్ల ఎత్తు ఉన్న ఈ తుఫాను కారణంగా శ్రీకాకుళంతో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని చాలాచోట్ల భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. టిట్లి తుఫాను కారణంగా ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రమాద హెచ్చరికలు

టిట్లి తుఫాను తీరం దాటిన సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాతో పాటు ఒడిశాలోని తీర ప్రాంతాలైన గజపతి, గంజాం, ఖుర్దు నయాగడ్ పూరి తదితర జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం ఓడ రేవులలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలలు మూడు కిలో మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి.

కూలిన చెట్లు, ఒరిగిన కరెంట్ పోల్స్

భారీ ఈదురు గాలులు, వర్షాల కారణంగా పెద్దపెద్ద చెట్లు కూడా ఊగుతున్నాయి. గోపాలపూర్ సమీపంలోని పలాసలో గాలుల వేగం 150 కిలో మీటర్ల వరకు ఉన్నట్లుగా గుర్తించారు. బెర్హాంపూర్ - గోపాలపూర్ మధ్య రోడ్ కనెక్టివిటీ తెగిపోయింది. ఎన్నో చెట్లు నేల కూలాయి. విద్యుత్ పోల్స్ కూలిపోయాయి. శ్రీకాకుళం, గంజాం జిల్లాల్లో చెట్లు నేలకూలి, విద్యుత్ పోల్స్ ఒరిగిపోయాయి.

English summary
Cyclone Titli crossed shore between Gollapadu and Pallisaradhi villages in Vajrapukotturu Mandal in Srikakulam district at 4.30 am wee hours of Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X