వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌కు తప్పిన 'వాయు' గండం.. దిశ మార్చుకున్న తుఫాను

|
Google Oneindia TeluguNews

Recommended Video

గుజరాత్‌కు తప్పిన 'వాయు' గండం.. దిశ మార్చుకున్న తుఫాను || Oneindia Telugu

అహ్మదాబాద్ : గుజరాత్‌కు గండం తప్పింది. తీరం వైపు శరవేగంగా దూసుకొచ్చిన వాయు తుఫాను రాత్రికి రాత్రి దిశ మార్చుకుంది. తీరం వైపు కాకుండా సముద్రంలోకి పయనిస్తోంది. దీంతో మూడు నాలుగురోజులుగా టెన్షన్ పడుతున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తుఫాను దిశ మార్చుకున్నప్పటికీ పశ్చిమ తీర ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతోంది.

వీడియో వైరల్ : ఢిల్లీని కమ్మేసిన ఇసుక తుఫాను... నగరవాసులకు ఎండవేడిమి నుంచి ఊరటవీడియో వైరల్ : ఢిల్లీని కమ్మేసిన ఇసుక తుఫాను... నగరవాసులకు ఎండవేడిమి నుంచి ఊరట

మరో 48గంటల పాటు అప్రమత్తం

మరో 48గంటల పాటు అప్రమత్తం

గుజరాత్ పశ్చిమ తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులతో పాటు సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రానున్న 48 గంటల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను పెను ప్రభావం చూపనుందన్న కారణంతో అప్రమత్తమైన అధికారులు గుజరాత్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతం డయ్యూ నుంచి దాదాపు 3లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తక్షణ సాయం అందించేందుకు 52 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.

స్కూళ్లు, కాలేజీలకు సెలవు

స్కూళ్లు, కాలేజీలకు సెలవు

వాయు తుఫాను ప్రభావంతో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను హెచ్చరికలను ఉపసంహరించుకునే వరకు తీర ప్రాంతంలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. వాతావరణం అనుకూలంగా కారణంగా పశ్చిమ రైల్వే 70ట్రైన్లు రద్దు చేయగా.. మరో 28రైళ్ల దారి మళ్లించింది. విమాన సర్వీసులపైనా తుఫాను ప్రభావం పడింది. పోర్ బందర్, డయ్యూ, భావ్ నగర్, కాండ్లా ఎయిర్‌పోర్టుల్లో సేవలు నిలిచిపోయాయి.

 ముంబైపైనా వాయు ప్రభావం

ముంబైపైనా వాయు ప్రభావం

వాయు తుఫాను ప్రభావం ముంబైపైనా పడింది. వాతావరణం అనుకూలించని కారణంగా దాదాపు 400 ఫైట్లు రాకపోకలు ఆలస్యమయ్యాయి. రెండు విమానాలను దారి మళ్లించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ను అప్రమత్తం చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

English summary
Cyclone Vayu has changed its course overnight and moved further into the sea, much to the relief of the administration. However, the western coast continues to be on high alert as strong winds and rough seas are expected for the next 24 to 48 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X