• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Cyclone Yaas: ధమ్రా పోర్ట్ వద్ద తీరానికి: మమతా గట్స్: ఈ రాత్రికి ఆ టౌన్‌లో మకాం

|

కోల్‌కత: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ యాస్ మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. అతి తీవ్ర తుఫాన్‌గా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణం, ఆగ్నేయ దిశగా సుమారు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటగంటకూ బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒడిశా ఉత్తర ప్రాంతంలోని బాలాసోర్ సమీపంలోని ధమ్రా పోర్ట్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. పారాదీప్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్స్ దిశగా ప్రస్తుతం ఈ తుఫాన్ కదలికలు ఉన్నాయని చెప్పారు.

ధమ్రా పోర్ట్-చండ్‌బలి మధ్య యాస్ తుఫాన్ తీరాన్ని దాటడానికి అధిక అవకాశాలు ఉన్నాయని వాతావరణ భువనేశ్వర్‌లోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం సైంటిస్ట్ డాక్టర్ ఉమాశంకర్ దాస్ వెల్లడించారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయానికి మరింత భీకరంగా మారడానికి అనుకూల వాతవరణం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో ఇప్పటికే ఒడిశా తీర ప్రాాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేంద్రపార, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లో 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నట్లు ఉమాశంకర్ దాస్ పేర్కొన్నారు. చండ్‌బలిలో వటవృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉందని, అత్యధికంగా ఆస్తినష్టం అక్కడే చోటు చేసుకోవచ్చని అన్నారు.

Cyclone Yaas: CM Mamata Banerjee will stay in Nabanna tonight and monitor the situation

పూరీ, జగత్‌సింగ్‌పూర్, ఖుర్దా, కటక్, కేంద్రపారా, జైపూర్, భద్రక్, బాలాసోర్, మయూర్‌భంజ్, ఢెంకనాల్, కియొంఝర్, అంగుల్, దేవ్‌గఢ్, సుందర్‌గఢ్, చండ్‌బలి‌లల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీర ప్రాంత జిల్లాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను జాతీయ, రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మేదినిపూర్, దక్షిణ 24 పరగణ, హౌరా, హుగ్లీ, ఉత్తర 24 పరగణ, పురూలియా, బాంకురా, బర్ధమాన్, కోల్‌కత, బీర్‌భూమ్, నాదియా, ముర్షీదాబాద్‌లల్లో తుఫాన్ ప్రభావాన్ని చూపుతోంది. ఆయా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.

తుఫాన్ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ.. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోన్నారు. తుఫాన్ ప్రభావానికి గురయ్యే నబన్నలో తాను ఈ రాత్రి బస చేస్తానని మమతా బెనర్జీ వెల్లడించారు. హౌరా జిల్లా పరిధిలోని నబన్నలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌లో తాను ఉంటానని, సహాయక, పునరావాస చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు చెప్పారు.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee told that she will stay in Nabanna town tonight and will monitor the situation closely due to the Cyclone Yaas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X