• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

Cyclone Yaas Live updates:తీవ్ర రూపం దాల్చిన యాస్... ఒడిశా తీరం వద్ద విరుచుకుపడ్డ తుఫాన్..

|

బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ యాస్ మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. అతి తీవ్ర తుఫాన్‌గా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణం, ఆగ్నేయ దిశగా సుమారు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటగంటకూ బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒడిశా ఉత్తర ప్రాంతంలోని బాలాసోర్ సమీపంలోని ధమ్రా పోర్ట్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. పారాదీప్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్స్ దిశగా ప్రస్తుతం ఈ తుఫాన్ కదలికలు ఉన్నాయని చెప్పారు. యాస్ తుపానుకు సంబంధించి పూర్తి వివరాలు లైవ్‌లో మీకోసం

Cyclone Yaas Live updates:Storm nears making landfall, Bengal and Odisha on high alert

Newest First Oldest First
12:30 AM, 27 May
యాస్ తుఫాను పశ్చిమబెంగాల, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. తీరప్రాంతాల్లోని అనేక ఇళ్ళు నీటమునిగిపోయాయి.
12:30 AM, 27 May
పశ్చిమ బెంగాల్
పశ్చిమబెంగాల్‌లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు అందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.
10:54 PM, 26 May
వరదనీటితో చెరువును తలపిస్తోన్న తీర ప్రాంతం
10:52 PM, 26 May
విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.. రహదారులు ధ్వంసం అయ్యాయి
10:52 PM, 26 May
తుపాన్‌తో తీర ప్రాంతంపై భారీగా ప్రభావం చూపించింది.
10:51 PM, 26 May
తుపాన్ తర్వాత పరిస్థితిని సమీక్షిస్తోన్న ఒడిశా సీఎం
10:50 PM, 26 May
ఒడిశా, బెంగాల్‌ను ఆదుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు
9:54 PM, 26 May
రంగంలోకి దిగిన 113 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
9:16 PM, 26 May
ఈదురుగాలులకు కూలిన వృక్షాలు, ఇళ్లలోకి చేరిన వరద నీరు
9:13 PM, 26 May
ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతోన్న సహాయక చర్యలు
9:13 PM, 26 May
లక్షలాది మందిపై ప్రభావం చూపిన యాస్ తుపాన్
6:34 PM, 26 May
ఇళ్లలోకి చొచ్చుకొచ్చిన నీరు, ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేత
6:33 PM, 26 May
ఒడిశాలో సముద్ర తీరంలో గల గ్రామాలకు చేరిన సముద్రపు నీరు
5:11 PM, 26 May
ఒడిశాలోని బాలాసోర్, భద్రక్ జిల్లాలపై యాస్ తుఫాన్ అధిక ప్రభావం
4:32 PM, 26 May
ఒడిషా
యాస్ తుఫాన్ ఒడిశాలోని బాలాసోర్,భద్రక్ జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. రెండు జిల్లాల్లో భారీ వర్షాల ధాటికి చాలాచోట్ల చెట్లు కూలిపోయాయి. 150కి.మీ వేగంతో వీచిన బలమైన ఈదురు గాలులకు చాలాచోట్ల ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
3:40 PM, 26 May
పశ్చిమ బెంగాల్
తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో మే 28న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటించనున్నారు.
2:43 PM, 26 May
ఒడిషా
ఒడిశాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఫైర్ సర్వీస్ టీమ్స్ యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు.
2:16 PM, 26 May
పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్న ఇండియన్ ఆర్మీ బృందాలు
1:27 PM, 26 May
యాస్ తుఫాన్ నేపథ్యంలో ముంబై నుంచి కోల్‌కతా,భువనేశ్వర్‌లకు విమాన సర్వీసులు రద్దయ్యాయి.
12:15 PM, 26 May
ఆంధ్రప్రదేశ్
'యాస్' తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60కి.మీ నుంచి 70కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని బారువ తీరం వరకూ సముద్రంలో అలజడి ఉంటుందని వెల్లడించింది.
11:35 AM, 26 May
పశ్చిమ బెంగాల్
తుఫాన్ ప్రభావం కారణంగా బెంగాల్‌లోని తీర ప్రాంతాల నుంచి దాదాపు 11.5లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
10:26 AM, 26 May
ఆంధ్రప్రదేశ్
యాస్ తుఫాన్ ఎఫెక్ట్ : శ్రీకాకుళం తీర ప్రాంతంలో హైఅలర్ట్...
9:56 AM, 26 May
పశ్చిమ బెంగాల్
యాస్ తుఫాన్ ఎఫెక్ట్ : కోల్‌కతా నగరాన్ని ముంచెత్తిన వర్షం...
9:21 AM, 26 May
పశ్చిమ బెంగాల్
తుఫాన్ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ.. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
8:48 AM, 26 May
ఒడిషా
తుఫాన్ ప్రభావంతో భారీ ఈదురు గాలులు,వర్షపాతం ఒడిశా తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భద్రక్ జిల్లాలోని ధమ్రాలో భారీగా వర్షం కురుస్తోంది. ఈరోజు మధ్యాహ్నానికి తుఫాన్ తీవ్రరూపం దాల్చి గంటకు 130కి.మీ నుంచి 140కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
8:11 AM, 26 May
పశ్చిమ బెంగాల్
యాస్ తుఫాను దెబ్బకు బెంగాల్‌లో 80 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
8:11 AM, 26 May
పశ్చిమ బెంగాల్
యాస్ తుఫాన్‌కు కొద్ది గంటల ముందు బెంగాల్‌లో టోర్నడో భీభత్సం సృష్టించింది.
7:32 AM, 26 May
పశ్చిమ బెంగాల్
తుఫాన్ సహాయక చర్యల కోసం ఇండియన్ నేవీ షిప్స్,ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను ఇప్పటికే సిద్దం చేశారు.
7:30 AM, 26 May
ఒడిషా
యాస్ తుఫాన్ నేపథ్యంలో ఒడిశా,కోల్‌కతా రాష్ట్రాలు రెడ్ అలర్ట్ జారీ చేశాయి. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
10:57 PM, 25 May
ఒడిషా
ఒడిషాలో సురక్షిత ప్రాంతాలకు ప్రజలు తరలింపు
READ MORE

English summary
As per the IMD, the storm has intensified into a 'very severe cyclonic storm' category. The department has also issued a red-coded warning alert to the Odisha and West Bengal coasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X