వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల్లో పోటీచేయాలంటే పైసలుండాలా? బరిలోకి సిలిండర్ సప్లయర్

|
Google Oneindia TeluguNews

బీహార్ : కిషన్‌గంజ్‌లో ఛోటే లాల్ అంటే పెద్ద పేరే మరి. పేరులో చిన్నోడు అని కనిపిస్తున్నా.. ఆయన చేసే కొన్ని పనులు పెద్దగానే ఉంటాయి. సిలిండర్ సప్లయర్ గా జీవిత నౌకను లాగుతున్న 42 ఏళ్ల ఛోటే లాల్ పేరు.. ఆ ఏరియాలో చాలా ఫేమస్. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడ ఛోటే లాల్ పేరు మార్మోగుతుంటుంది. గ్యాస్ సిలిండర్ కంపెనీలో పనిచేస్తూ ఇంటింటికీ సిలిండర్లు సప్లై చేసే ఛోటే లాల్ ఈసారి కూడా లోక్‌సభ బరిలోకి దిగుతున్నాడు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు ముఖ్య పాత్ర పోషిస్తాయనే ఆలోచనకు ఈ చిన్నోడు బ్రేక్ వేస్తున్నాడు.

ఎన్ని'కలలో'..!

ఎన్ని'కలలో'..!

ఛోటేలాల్ ఇప్పటివరకు 5 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, మరో 3 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం విశేషం. ఇక 2014లో

కిషన్‌గంజ్‌ సెగ్మెంట్ నుంచి పోటీ చేయగా 11,400 ఓట్లు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈసారి కూడా అక్కడినుంచే పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు.

ఎన్నికలొస్తే పద్మరాజన్ కు పండుగే.. రికార్డు స్థాయిలో పోటీ.. ఒక్కసారైనా గెలిచాడా?ఎన్నికలొస్తే పద్మరాజన్ కు పండుగే.. రికార్డు స్థాయిలో పోటీ.. ఒక్కసారైనా గెలిచాడా?

మందీ మార్బలం ఉండదు.. సింగిల్ హ్యాండ్

మందీ మార్బలం ఉండదు.. సింగిల్ హ్యాండ్

ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నామినేషన్ ప్రక్రియ, ప్రచార సామాగ్రి ముద్రణ, ఇంటింటికీ తిరగడం, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. ఇంత తతంగమున్నా ఛోటే లాల్ మాత్రం తన వృత్తిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడు. ఇంటింటికీ సిలిండర్లు వేస్తూనే ఉంటాడు. పనిలో పనిగా ఓట్లు కూడా అడిగేస్తుంటాడు.

ఎలక్షన్ల ప్రచారమంటే మందీ మార్బలం ఉండాలి కదా. ఛోటే లాల్ మాత్రం అలాంటి ఆర్భాటాలకు పోడు. కేవలం సింగిల్ గానే ప్రచారం నిర్వహిస్తాడు. కరపత్రాలు, తదితర ప్రచార సామాగ్రి అంటూ హడావిడి కూడా ఏముండదు. జస్ట్ నోటితోనే తన గుర్తు చెప్పేస్తాడు. ఓటర్లను ఆకర్షిస్తాడు.

ఏనాటికైనా?.. అధ్యక్షా..!

ఏనాటికైనా?.. అధ్యక్షా..!

జనం తనకు మద్దతుగా నిలవడం ఆనందంగా ఉందంటున్నాడు. కొంతమంది ఆర్థిక సాయం చేస్తారని కూడా చెబుతున్నాడు. అదలావుంటే ఎన్నికల ప్రక్రియలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కోట్లు గుమ్మరిస్తుంటే.. స్వతంత్ర అభ్యర్థులకు గెలిచే ఛాన్స్ ఎక్కడుంటుంది. అయితే ఛోటే లాల్ తీరు చూస్తుంటే మాత్రం ఏనాటికైనా తన కల నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తుంది.

English summary
The 42-year-old cooking gas supplier chote lal has been contesting elections in bihar, both parliamentary and assembly, since 2004. He is a one-man army unlike regular party candidates who have large support system. He does everything on his own.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X