బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆసుపత్రిలో ట్రబుల్ షూటర్ డీకేశీ, అభిమానులుకు మనవి, అదే ఒత్తిడి, ఆందోళన!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ అనారోగ్యంతో బెంగళూరు నగరంలోని శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డీకే. శివకుమార్ కు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, త్వరగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారని, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందనవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు మనవి చేశారు.

అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!

డీకేకి అర్దరాత్రి చాతి నొప్పి

డీకేకి అర్దరాత్రి చాతి నొప్పి

సోమవారం అర్దరాత్రి సమయంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే. శివకుమార్ కు చాతి నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు డీకే. శివకుమార్ ను శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. డీకే. శివకుమార్ కు రక్తపోటు ఎక్కువ ఉండటం, వెన్ను నొప్పి ఎక్కువగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

వైద్యులు ఏం చెప్పారంటే !

వైద్యులు ఏం చెప్పారంటే !

డీకే. శివకుమార్ కు ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు దయచేసి ఆసుపత్రి దగ్గరకు రాకూడదని, మీరు ఆసుపత్రి దగ్గరకు వస్తే మీ నాయకుడు మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, మీరు కచ్చితంగా మా మాట వింటారని నమ్ముతున్నామని డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులు మనవి చేశారు.

జైల్లో ఒత్తిడి

జైల్లో ఒత్తిడి

అక్రమ నగదు లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కేసులకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు డీకే. శివకుమార్ ను అరెస్టు చేసి ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైల్లో ఉన్న సమయంలో డీకే. శివకుమార్ తీవ్ర ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురైనారు.

డీకే అభిమానులు క్యూ !

డీకే అభిమానులు క్యూ !

48 రోజుల పాటు తీహార్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించిన డీకే. శివకుమార్ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన డీకే. శివకుమార్ ను కలవడానికి బెంళూరు నగరంలోని సదాశివనగర్ లోని ఆయన ఇంటి ముందు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్యూకట్టారు.

డీకేకి దెబ్బ మీద దెబ్బ

డీకేకి దెబ్బ మీద దెబ్బ

ఇటీవల డీకే. శివకుమార్ మండ్య, మైసూరు, రామనగర జిల్లాల్లో విశ్రాంతి లేకుండా పర్యటించారు. బెంగళూరు నగరంలోని కేపీసీసీ కార్యాలయంలో ఉప ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న సమావేశాలకు వరుసుగా హాజరైన డీకే. శివకుమార్ మళ్లీ అనారోగ్యానికి గురైనారు. ఇదే సమయంలో డీకే. శివకుమార్ కు విశ్రాంతి అవసరమని, దయచేసి ఆసుపత్రి దగ్గరకు ఎవ్వరూ రాకూడదని డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనవి చేశారు.

English summary
Karnataka former minister D.K.Shivakumar family members request for fans and Congress party workers. D.K.Shivakumar admitted to Apollo hospital Seshadripuram, Bengaluru on November 11, 2019 night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X