వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈడీ కేసు, ట్రబుల్ షూటర్ ఆస్తులు రూ. 600 కోట్లు, క్రిమినల్ కేసులు, బీజేపీ లీడర్ దగ్గర అప్పులు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి డీకే. శివకుమార్ ఆస్తులు రూ. 600 కోట్లకు పైగా ఉన్నాయి. 2013 ఎన్నికలతో పోల్చితే డీకే. శివకుమార్ ఆస్తులు రెండింతలు అయ్యాయి. 2013లో డీకే. శివకుమార్ తన ఆస్తులు రూ. 251 కోట్లు అని, 2018 శాసన సభ ఎన్నికల సమయంలో తన ఆస్తుల విలువ రూ. 600 కోట్లకు పైగా ఉందని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు.

బీజేపీకి శాపం పెట్టిన ట్రబుల్ షూటర్ తల్లి, ఐటీ దాడులు, ఈడీ కేసులు ! ఏం బాగుపడుతారు ?బీజేపీకి శాపం పెట్టిన ట్రబుల్ షూటర్ తల్లి, ఐటీ దాడులు, ఈడీ కేసులు ! ఏం బాగుపడుతారు ?

 రూ. 619. 80 కోట్ల ఆస్తి

రూ. 619. 80 కోట్ల ఆస్తి

ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ఆస్తి రూ. 6, 19, 80, 05, 566.32 కోట్లు. డీకే. శివకుమార్ మొత్తం చరాస్థి రూ. 70, 94, 84, 974. 32,

స్థిరాస్తి రూ. 5, 48, 85, 20, 594. కర్ణాటక శ్రీమంత రాజకీయ నాయకుల్లో డీకే. శివకుమార్ ఒకరు. 2018. 2018 శాసన సభ ఎన్నికల సమయంలో డీకే. శివకుమార్, ఆయన భార్య ఉషా, కుమారులు అభరణ, ఆకాష్, కుమార్తె ఐశ్వర్య ఆస్తుల వివరాలు ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు.

 డీకే. శివకుమార్ మీద క్రిమినల్ కేసులు

డీకే. శివకుమార్ మీద క్రిమినల్ కేసులు

*. ఐపీసీ సెక్షన్ 468 కింద ఫోర్జరీ కేసు

*. అవినీతి ఆరోపణల మీద ఐపీఎస్ సెక్షన్ 120(B), 169,177,417,419,465,468 సెక్షన్ ల కింద కేసులు నమోదైనాయి.
*. నకిలీ పత్రాలు తయారు చేశారని, అక్రమంగా భూముల లావాదేవీలు చేశారని, అక్రమ మైనింగ్, దాడులు చేశారని తదితర కేసులు డీకే. శివకుమార్ మీద నమోదు అయ్యాయి. తన మీద పై కేసులు ఉన్నాయని స్వయంగా డీకే. శివకుమార్ ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు.

ఢిల్లీ, ముంబై, బెంగళూరులో నివాసం

ఢిల్లీ, ముంబై, బెంగళూరులో నివాసం

డీకే. శివకుమార్ కు ఢిల్లీలోని సర్ఫజంగ్ ఎన్ క్లేవ్, కృష్ణానగర్, ముంబైలో ఫ్లాట్, బెంగళూరులోని సదాశివనగర్ లో బంగ్లా, ఫ్లాట్, కనకపురలో నివాస భవనాలు ఉన్నాయి. కంగేరి, కనకపుర, బెంగళూరులోని ఇన్ఫాంటి రోడ్డు, మడివాళలో ఐదు కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. బెంగళూరులోని కేఆర్ పురం, భూపసంద్ర, ఉత్తరహళ్ళి, కనకపుర, మైసూరు, గోపాలపుర, ఓకళిపురం, మైసూరులో మరో మూడు ప్రాంతాల్లో భవనాలు ఉన్నాయి. సర్జాపుర, కనకపురలో డీకే. శివకుమార్ కు భూములు ఉన్నాయి.

అప్పులు, వ్యాపారాలు

అప్పులు, వ్యాపారాలు

విజయ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులో తనకు అప్పులు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రూ. 99 కోట్లు రుణం తీసుకున్నానని, మొత్తం రూ. 105 కోట్లు అప్పులు ఉన్నాయని డీకే. శివకుమార్ ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు. ఆదాయపన్ను, సేవా పన్ను, ఆస్తి పన్ను మొత్తం చెల్లించానని, ఎలాంటి పన్నులు చెల్లించలేదని తన మీద ఆరోపణలు లేవని 2018 శాసన సభ ఎన్నికల సమయంలో డీకే. శివకుమార్ ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు.

 బీజేపీ లీడర్ దగ్గర రుణం

బీజేపీ లీడర్ దగ్గర రుణం

వ్యక్తిగతంగా వివిద సంస్థలు, బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి సీపీ. యోగేశ్వర్ తదితరుల దగ్గర రూ. 51 కోట్లు రుణం తీసుకున్నానని డీకే. శివకుమార్ అప్పట్లో ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు. కనకపుర తాలుకా అలహళ్ళి గ్రామానికి చెందిన కెంపేగౌడ, గౌరమ్మ దంపతుల కుమారుడైన డీకే. శివకుమార్ (56) ఎంఏ విద్యాభ్యాసం చేశారు. రాజకీయాలతో పాటు వ్యాపారాలు, సమాజసేవ, విద్యాసంస్థల్లో భాగస్వామిగా, మాస్ లీడర్ గా డీకే. శివకుమార్ గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తం మీద డీకే. శివకుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు చెయ్యడంతో ఆయన అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.

English summary
Karnataka former Minister, Congress leader D K Shivakumar declared assets over Rs 600 crore in an affidavit filed along with his nomination for the May 12 assembly election (2018) in the Karnataka state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X