బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిక్కుల్లో శశికళ ఫ్యామిలీ: ఆదాయ పన్ను చెల్లించారా ? లేదంటే జైలే గతి!

|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు కోర్టు విధించిన రూ. 30 కోట్ల అపరాద రుసుం ఏ మార్గంలో చెల్లించాలని వారి కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు.

<strong>షాక్: పన్నీర్ వర్గంలోకి ఐదు మంది మంత్రులు జంప్ ! సీఎం సమావేశం</strong>షాక్: పన్నీర్ వర్గంలోకి ఐదు మంది మంత్రులు జంప్ ! సీఎం సమావేశం

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జయలలితకు రూ. 100 కోట్లు, శశికళకు రూ. 10 కోట్లు, ఇళవరసికి రూ. 10 కోట్లు, సుధాకరన్ కు రూ. 10 కోట్లు చొప్పున సుప్రీం కోర్టు అపరాద రుసుం విధించింది. జయలలిత ఆస్తులు అమ్మి తమిళనాడు ప్రభుత్వానికి రూ. 100 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

DA case: Sasikala and her family is struggling to find the ways to pay the huge fine of Rs 30 crore

ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు పలు కంపెనీల్లో వ్యాపారాలు ఉన్నాయి. వందల కోట్ల రూపాయల టర్నోవర్ ఉంది. అయితే శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు ఏ మార్గంలో అపరాద రుసుం చెల్లించాలని అని అర్థంకాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.

<strong>రాఘవ లారెన్స్ ను అడ్డుకున్న పోలీసులు: హీరో విశాల్, స్టాలిన్ మద్దతు</strong>రాఘవ లారెన్స్ ను అడ్డుకున్న పోలీసులు: హీరో విశాల్, స్టాలిన్ మద్దతు

రూ. 30 కోట్లు అపరాద రుసుం చెల్లించాలంటే అందుకు ఆదాయ పన్ను చెల్లించినట్లు పక్కా ఆధారాలు కావాలి. ఇప్పుడు ఈ ముగ్గురూ ఒక్కొక్కరు రూ. 10 కోట్లకు పైగా సంపాధించినట్లు ఆదాయ పన్ను చెల్లించారా ? లేదా ? అని న్యాయవాదులు వివరాలు సేకరిస్తున్నారు.

English summary
Sasikala and her family is struggling to find the ways to pay the huge fine of Rs 30 crore for Sasikala, Ilavarasi and Suthagaran in DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X