వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముడుపుల కేసు: ఆయుధ డీలర్ భండారి, శాంసంగ్ ఇంజనీరింగ్, ఓఎన్జీసీ అధికారులపై సీబీఐ ఎఫ్ఐఆర్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్‌ భండారికి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మరో ఉచ్చు బిగించింది. ఓఎన్జీసీ ప్రాజెక్టులో ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఆయనతోపాటు సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ ఇంజనీరింగ్ కంపెనీ, ఓఎన్జీసీకి చెందిన గుర్తుతెలియని అధికారులపైనా బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు.. మూడు రోజుల్లో పరిష్కారమన్న సర్కారు.. చంద్రబాబే కారణమంటూ.. ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు.. మూడు రోజుల్లో పరిష్కారమన్న సర్కారు.. చంద్రబాబే కారణమంటూ..

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2009వ సంవత్సరంలో గుజరాత్ లో తలపెట్టిన ఓఎన్జీసీ ప్రాజెక్టు(దహేజ్ ప్రాజెక్టు)కు సంబంధించి విదేశీ కన్సార్టియంతో ఓఎన్జీసీ సంస్థ కుదుర్చుకున్న రూ.6,744కోట్ల ఒప్పందం వెనుక ముడుపుల వ్యవహారం నడిచినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. అందులో రాబర్ట్ వాద్రా, ఆయన అనుయాయులకు లంచాలు అందాయని ఈడీ ఆరోపిస్తోంది. అలా పెట్రోలియం, డిఫెన్స్ రంగాల్లో ఒప్పందాల ద్వారా వాద్రా భారీగా లబ్ధి పొందారని, ఆ సొమ్ముతోనే లండన్‌లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కొనుగోలు చేశారన్న బీజేపీ ఆరోపణల మేరకు సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.

Dahej corruption: CBI books Sanjay Bhandari, Samsung Engineering co, ONGC officials

Recommended Video

Watch Gas Leakage From ONGC’s Pipeline in AP’s East Godavari

ముడుపుల వ్యవహారంలో ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి చక్రం తిప్పారని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని తన కంపెనీ సాన్‌టెక్ ఇంటర్నేషనల్ కు నిధులు మళ్లించి, వర్టెక్స్ అనే మరో ప్రైవేటు సంస్థ నుంచి బ్రయాన్‌స్టోన్ స్క్వేర్‌లోని బంగళాను సాన్‌టెక్ కొనుగోలు చేసిందని... ఆ తర్వాత వర్టెక్స్ షేర్లు స్కైలైట్ ఇన్వెస్ట్‌మెట్ సంస్థకు బదిలీ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. స్కైలైట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు విదేశాల్లో స్థిరపడిన భారతీయ వ్యాపారవేత్త సీ తంపి నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో సౌత్ కొరియా కంపెనీ శాంసంగ్ ఇంజనీరింగ్ లిమిలెడ్ పాత్ర కూడా నిర్ధారణ కావడంతో సీబీఐ ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

English summary
The CBI has booked middleman Sanjay Bhandari along with South Korea-based Samsung Engineering Co. Limited (SECL), unknown officials of ONGC for ‘corruption’ in Dahej project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X