వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2నెలల బాబుకి గుండె నుంచి రక్తం ప్రవహించడం లేదు: సాయం చేసి ఆదుకోండి

Google Oneindia TeluguNews

"నేను మొదటిసారిగా నా బిడ్డ "దక్ష్" చేతిని తాకినప్పుడు, అతను తన చిన్ని చేతులతోనే గట్టిగా నా వేళ్ళను వదలకుండా పట్టుకున్నాడు. కానీ ఇప్పుడు తనని నేను ప్రేమగా ముద్దాడుదామంటే తెలియని వేదనకు గురవుతున్నాడు. గట్టిగా ఏడుస్తున్నాడు. శరీరంలో చమట ఎక్కువగా చేరడం కారణంగా, ఎత్తుకుంటే పడిపోతాడేమో అనే భయం నా బిడ్డకు ఉంది. తన సున్నితమైన శరీరం నిండా పైపులు అమర్చారు డాక్టర్లు. తనని చూస్తేనే ఒళ్ళు చమర్చే స్థితిలో ఉన్నాడు. కానీ ఆ పైపుల నుంచి తనను తాను విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అతని పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. మా బాబును బాధ నుంచి విముక్తి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము" అంటూ దక్ష్ తండ్రి ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యాడు.

చిన్నారి దక్ష్‌ను ఆదుకునేందుకు ఇక్కడ క్లిక్ చేసి సాయం అందించండి

ఆపరేషన్ థియేటర్లో మొదటిసారి నా బిడ్డను తీసుకుని వెళ్లినప్పుడు, అతని ఏడుపు వినపడింది. నేను పరుగున థియేటర్లోనికి వెళ్లి చూడగా, ఊహించని రీతిలో నవ్వుతూ, ఉల్లాసంగా కనిపించాడు. ఆ నవ్వును శాశ్వతంగా అతనికి బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నాను.

Daksh’s Heart Is Not Able To Pump Blood, Need Rs 6 Lakh For Surgery

మా ప్రపంచమేదో, మేమేదో అన్నట్లుగా సంతోషంగా బతికే మా జీవితంలో ఊహించని అనూహ్యమైన పరిణామం ఇది. మా బాబు పడే బాధ మమ్మల్ని కుంగిపోయేలా చేస్తుంది. అతని మీద నా చూపులు పడిన మొట్టమొదటి క్షణం నుంచే నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు దక్ష్. అతనితో కాలక్షేపమే నాకు ఎనలేని సంతోషం. నేను నా బిడ్డ నుంచి ఏదీ ఆశించను, కళ్ళ ముందు జీవించి ఉంటే చాలు" అంటూ ఆపుకోలేని కన్నీళ్ళతో భావోద్వేగాలను పంచుకుంది దక్ష్ తల్లి.

దక్ష్ తల్లి మొదటి సారి అతన్ని చమటలతో చూసినప్పుడు, ముంబైలోని వేడి, తేమతో కూడిన వాతావరణం కారణంగా అతనికి ఇలా చెమటలు పడుతున్నాయని భావించి, తేలికగా తీసుకుంది. నలాసోపారాలోని వారి చిన్న ఇంట్లో వెంటిలేషన్ స్థాయిలు కూడా అంతగా ఉండేవి కావు. ఏదిఏమైనప్పటికీ రన్ డౌన్ నిర్మాణంలోని ఇల్లు. అయినప్పటికీ, తాజాగాలి, ఓపెన్ ఏరియాలలో కూడా, అసాధారణ చెమటలతో నిరంతరం ఉండటం అనుమానాలకు తావిచ్చింది.

Daksh’s Heart Is Not Able To Pump Blood, Need Rs 6 Lakh For Surgery

"ఒకసారి అతని అసాధారణ చెమటను చూసి భయపడ్డాను, ఏదో సమస్యకు లోనయ్యాడని గ్రహించడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఎటువంటి ఇతర ప్రభావాలు కనపడకుండా, కేవలం చమటలే కనపడడం కారణంగా, పరిస్థితిని అంచనా వేయడానికి కూడా సమయం పట్టింది. ఆ చమటలను చూసి భయపడిన నేను, వెంటనే ఇంటికి తరలించి, తన బట్టలు తీసివేసాను, అప్పటికీ చెమటలు తగ్గలేదు. క్రమంగా ఆహారం స్వీకరించడానికి విముఖత ప్రదర్శించేవాడు, అంతేకాకుండా రోజులో అధిక శాతం చికాకును కలిగి ఉండేవాడు. కిటికీలు తెరిస్తే అయినా, అతని చమటలు తగ్గుతాయని భావించినా, ఏమాత్రం ఫలితం ఇవ్వకపోగా, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడడం గమనించాను.

పరిస్థితి తీవ్రత పెరుగుతుండడం గమనించిన దక్ష్ తల్లిదండ్రులు ఇద్దరూ, సమీపంలోని ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ ఆ స్థానిక ఆసుపత్రిలో అతని పరిస్థితి నిర్ధారణకు అవసరమైన సామగ్రి లేదా వైద్యులు లేరని అర్ధం చేసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ముంబైలోని నానావతి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. వారి ఇంటి నుంచి ఆసుపత్రికి 1.5 గంటలు ప్రయాణం ఇంచుమించుగా ఉంటుంది. జలుబు, జ్వరం, లేదా సీజనల్ వైరల్ ఫీవర్ వంటి సాధారణ సమస్య అయి ఉంటుంది, అంతకన్నా మరేమీ కాదు అన్న భావనతోనే నానావతి హాస్పిటల్ చేరుకున్నారు దక్ష్ తల్లిదండ్రులు.

Daksh’s Heart Is Not Able To Pump Blood, Need Rs 6 Lakh For Surgery

సమస్య ఉంది కానీ, పరిధిని దాటిపోయింది :

వైద్యులు వారి కొడుకు బృహద్ధమని సన్నగిల్లడం (ఆర్టా(పెద్ద ధమని)-కోఆర్కటేషన్) కారణంగా పనితీరు గుండె పనితీరు మందగించి, బాధపడుతున్నారని వారికి తెలియచేశారు. అంటే అతని హృదయం నుంచి శరీరానికి తగినంత రక్తాన్ని సరఫరా చేయలేక పోతుంది. శస్త్ర చికిత్సకు రూ. 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలియజేసారు. వెంటనే NICU కు తీసుకెళ్లారు. వారి తల్లిదండ్రులు సైతం అతని వద్దకు వెళ్లడానికి అనుమతించలేదు. దక్ష్ తండ్రి రోజువారీ కూలీగా పని చేస్తున్న వ్యక్తిగా ఉన్నందువలన., కనీసం రోగ నిర్ధారణా ఖర్చులు 15 వేలను కూడా భరించలేని స్థితిలో ఉన్నాడు. అలాంటిది తన శస్త్ర చికిత్స మొత్తాన్ని ఎలా నిర్వహించాలో అర్ధంకాక తీవ్ర క్షోభను అనుభవిస్తున్నారు.

"సాధ్యమైనంత త్వరలో ఆపరేషన్ చేయకపోతే మా బిడ్డ మాకు దక్కడు అని వైద్యులు తేల్చి చెప్పిన పక్షంలో, దిక్కులు తోచక నిస్సహాయ స్థితికి చేరుకున్నాం. మా రెండు నెలల పసిబిడ్డ జీవితాన్ని నిలదొక్కుకోవడం కోసం పోరాడుతూ ఉన్నాడు. అతని భాదను తీర్చేందుకు ఏ దారీ కనపడడం లేదు. కానీ వాడిని కాపాడుకోవాలి. గుండె సమస్య అతనిదైతే, మా గుండెలు కూడా బాధతో రగిలిపోతున్నాయి. గుండె మార్పిడే పరిష్కారం అయితే, నా గుండెను కూడా ఇస్తాను. కానీ అది పరిష్కారం కాదు. అతని బాధను పంచుకోడానికి కూడా, అతని వద్దకు చేరలేని స్థితిలో గాజు తలుపులకు అతుక్కుని అతన్నే చూస్తూ కాలం గడుపుతున్నాము." అంటూ అతని తల్లి తీవ్ర మనోవేదనకు లోనవుతూ ఉంది.

Daksh’s Heart Is Not Able To Pump Blood, Need Rs 6 Lakh For Surgery

"నా 2 నెలల వయస్సు బాబు, పైపులతో శరీరాన్ని నింపుకుని అసౌకర్యాన్ని అనుభవిస్తూ, ఆసుపత్రి పడకకు అంకితమైపోయి ఉంటే, నిస్సహాయంగా అతనిని చూసి బాధపడడం నా నిత్యకృత్యమైంది. అతని గుండె, తన వ్యవస్థలో భాగంగా శరీరానికి తగినంత రక్తాన్ని సరఫరా చేయడంలేదు. మాకు అర్ధమైంది ఇదొక్కటే. మరే ఇతర పరిస్థితి కూడా మాకు తెలీదు. కానీ ప్రాణాలు నిలదొక్కుకునేందుకు కొట్టుమిట్టాడుతున్నాడు అని మాత్రం అర్ధమైంది. శస్త్రచికిత్స మాత్రమే అతని ప్రాణాలు నిలబడేందుకు ఏకైక మార్గం. శస్త్రచికిత్సకు సుమారుగా 6 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఈ మొత్తాన్ని నేను కలలో కూడా ఊహించలేను." అని దక్ష్ తండ్రి తన బాధను పంచుకున్నారు.

Daksh’s Heart Is Not Able To Pump Blood, Need Rs 6 Lakh For Surgery

దక్ష్ శస్త్ర చికిత్సకు రూ 6 లక్షలు అవసరమవుతుంది. మనందరమూ చేతులు కలిపితే, ఆ పసివాని ప్రాణాలు నిలదొక్కుకుంటాయి. మీరు చేసే అతి చిన్న సహకారం కూడా వారికి ఎంతో అండగా నిలబడుతుంది. దక్ష్ మనుగడకు సహాయం చేయండి. ఈ వ్యాసాన్ని సామాజిక మాధ్యమాలలో మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పంచుకోవడం కూడా ఒక చిన్న సహాయమే అని మరచిపోకండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X