వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-చైనా వివాదంపై దలైలామా కీలక వ్యాఖ్య: అప్పటి పరిష్కారాన్ని గుర్తుచేస్తూ..

గతంలోను ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ సమయంలో.. హిందీ-చీనీ భాయి భాయి అంటూ ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకున్నాయని గుర్తుచేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సిక్కీం సరిహద్దు ప్రాంతమైన భూటాన్ ట్రై జంక్షన్ వద్ద చైనా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని భారత్ అడ్డుకోవడం.. దాన్ని కౌంటర్ చేస్తూ వెనక్కి తగ్గకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటూ చైనా హెచ్చరించడం.. ఇరు దేశాల మధ్య ఉత్కంఠ వాతావారణాన్ని సృష్టించింది.

డోక్లామ్‌లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినాడోక్లామ్‌లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినా

ఇరు దేశాలు పోటాపోటీ వ్యాఖ్యలకు.. చైనా మీడియా అత్యుత్సాహం కూడా తోడవడంతో వివాదం మరింత ముదరింది. ఇప్పటికీ దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడనే లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బౌద్ద గురువు దలైలామా దీనిపై స్పందించారు.

Dalai Lama invokes Hindi Chini Bhai Bhai slogan, says Doklam standoff not very serious

భారత్-చైనా వివాదం అసలు పెద్ద సమస్యే కాదని, ఇవి రెండు ఎప్పటికీ సోదర దేశాలేనని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా దలైలామా ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోను ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ సమయంలో.. హిందీ-చీనీ భాయి భాయి అంటూ ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకున్నాయని గుర్తుచేశారు.

కబళించే ఎత్తుగడ: ఇండియాపై చైనా దూకుడు వెనుక.. ఇదీ అసలు కుట్ర?కబళించే ఎత్తుగడ: ఇండియాపై చైనా దూకుడు వెనుక.. ఇదీ అసలు కుట్ర?

ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న తీరుపై ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్చ ఉండే చోటునే తాను ఉండేందుకు ఇష్టపడుతానని దలైలామా అన్నారు. ఇండియాలో స్వేచ్చను ఇష్టపడుతాను కాబట్టే ఈ దేశాన్ని సొంతిల్లులా భావిస్తానని అన్నారు. ఇక్కడ స్వేచ్చ ఉండబట్టే తన అభిప్రాయాలను స్వేచ్చగా నలుగురితో పంచుకోగలుగుతున్నానని చెప్పారు.

చైనా ప్రజల మనోభావాలకు అనుగుణంగా చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా ప్రజాస్వామ్య విలువలను అనుసరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దలైలామా వ్యాఖ్యలను చైనా ఎలా స్వీకరిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

English summary
Describing the ongoing Doklam standoff as "not very serious", the Dalai Lama today invoked "Hindi Chini Bhai Bhai", a catch phrase that defined Sino-India ties in the 1950s, stressing that the two neighbours have to live side by side in peace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X