వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛాతీలో ఇన్ఫెక్షన్ హస్పిటల్‌లో చేరిన దలైలామా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : బౌద్ధ గురువు దలైలామా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా మంగళవారం రాత్రి ఢిల్లీలోని హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని దలైలామా అధికార ప్రతినిధి తెన్ జిన్ తక్లా చెప్పారు.

<strong>కేరళ 10తరగతి విద్యార్థిని ఎందుకు గుర్రంపై పరీక్షకు వెళ్లింది ?</strong>కేరళ 10తరగతి విద్యార్థిని ఎందుకు గుర్రంపై పరీక్షకు వెళ్లింది ?

ఓ కాన్ఫరెన్స్ నిమిత్తం ఢిల్లీకి వచ్చిన దలైలామా సోమవారమే ధర్మశాలకు తిరిగి వెళ్లారు. అయితే ఛాతీలో ఇబ్బంది తలెత్తడంతో వైద్య పరీక్షల కోసం ఆయనను మంగళవారం తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చారు. మాక్స్ హాస్పిటల్ డాక్టర్లు ఆయనను పరీక్షించి ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ట్రీట్‌మెంట్ కోసం దలైలామా హాస్పిటల్‌లో చేరారు. ఒకట్రెండు రోజుల పాటు ఆయన హాస్పిటల్‌లో ఉండనున్నారు.

Dalai Lama taken to hospital with chest infection

చైనా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసిన దలైలామా అది విఫలం కావడంతో 1959లో భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ధర్మశాలలోనే ఉంటున్నారు.

English summary
Spiritual leader Dalai Lama has been admitted to hospital in Delhi with a chest infection, an aide said, adding that the 83-year-old Buddhist monk was stable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X