వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళ్లు, చేతులు కట్టి దాడి : దాడికి గురైన వ్యక్తిపైనే పోక్సో కేసు, రాజస్థాన్‌లో దారుణం (వీడియో)

|
Google Oneindia TeluguNews

జైపూర్ : కాళ్లు, చేతులు కట్టేశారు. ఒక్కడిని చేసి .. నలుగురు చుట్టుముట్టారు. చేతిలో ఉన్న కర్రలతో తమ ప్రతాపాన్ని చూపించారు. వద్దని మొత్తుకున్న అలకించలేదు. ఈ ఘటనను ఓ నెటిజన్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది.

ఒంటరిని చేసి దాడి ...
ఇదిగో ఇక్కడ కనిపిస్తోన్న ఈ వీడియోలో ఉన్నది దళిత యువకుడు. కాళ్లు, చేతులు కట్టేశారు మరికొందరు. రాజస్థాన్‌లోని పాలి జిల్లా ధనేరియా గ్రామంలో జరిగిన ఘటన వీడియో వైరలవడంతో వెలుగుచూసింది. దళిత యువకుడిని మిగతా యువకులు చితకబాదారు. వద్దు .. కొట్టొద్దు ... అని మొత్తుకున్నా వినలేదు. అసలు ఎందుకు దాడిచేశారనే అంశంపై క్లారిటీ లేదు. కొందరేమో గుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని చెప్తున్నారు. దళితుడు కాబట్టి ప్రవేశం నిషిద్ధమని ఎలా .. గుడిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తాడని ప్రశ్నిస్తున్నారు. అయితే ఓ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడనే మరికొందరు చెప్తున్నారు. మైనర్‌తో అసభ్య ప్రవర్తనతో దాడికి తెగబడ్డారనే వాదన వినిపిస్తోంది.

Dalit boy tied up, thrashed by saffron-clad men in Rajasthan, POCSO case lodged against him

బీజేపీకి సంబంధం ఉందా ?
అయితే ఆ దళిత యువకుడిపై దాడిచేసిన ఓ వ్యక్తి కాషాయ కండువా వేసుకున్నారు. దీంతో బీజేపీ, అనుబంధ సంస్థల నేతల ప్రోద్బలంతో దాడి జరిగిందనే అనుమానం కలుగుతుంది. అకారణంగా అచేతనుడిని చేసి చావ కొట్టారని అర్థమవుతుంది. ఓ నెటిజన్ వీడియో తీసి పోస్ట్ చేయడంతో విషయం వెలుగుచూసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని పోలీసులు చెప్పారు. అయితే విచిత్రంగా దాడికి గురైన దళిత యువకుడిపైనే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. దీనిపై మీడియా ప్రశ్నిస్తే చిన్నారిపై లైంగికంగా వేధించారనే కారణంతో కేసు పెట్టినట్టు పేర్కొన్నారు. అంతేకాదు దాడిచేసిన వారిపై కూడా కేసు నమోదు చేశామని .. నిందితులను అరెస్ట్ చేశామని వివరించారు.

English summary
minor Dalit boy was mercilessly beaten up in Rajasthan's Pali district by a group of saffron-clad men. A video of the thrashing has gone viral on the internet. Rajasthan Police has now registered a case against the Dalit boy saying he was beaten up by the group of men for allegedly molesting a girl. Speaking to ANI, a police officer said a case under POCSO has been registered against the minor boy who was thrashed. The officer said, "Case registered under POCSO Act against him. After probe he has been sent to juvenile protection home. A viral video has come to light where locals are seen beating him, they have also been taken on remand."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X