వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాస్తికుడే దేవుడయ్యాడు...! దళితులకు రిజర్వేషన్లు కల్పించాడని.. కరుణానిధికి గుడి..

|
Google Oneindia TeluguNews

తమిళనాడులో విగ్రహారాధన మామూలే బతికున్న మనుష్యులకే ఆలయాలు నిర్మించిన ఘనత తమిళనాడు ప్రజలకే చెల్లుతుందనడంలో సందేహం లేదు.. ఇప్పటికే పలువురి నేతలకు,సినిమా నటులకు అభిమానంతో ముందుకు వచ్చే ప్రజలు స్వఛ్చందంగా గుళ్లు,గోపురాలు కట్టి పూజిస్తారు. అనంతరం నచ్చకపోతే కూలగొడుతారు కూడ.. ఇప్పుడు మరో రాజకీయ నేతకు గుడిని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు..తమ కులం అభివృద్దికి కృషి చేసిన నాయకుడిని గుండెళ్లో పెట్టుకున్న ఓ దళిత వర్గం ముప్పై లక్షల రుపాయాలు పోగు చేసి 10వేల ఎస్‌ఎఫ్‌టీలలో గుడిని నిర్మిస్తున్నారు.

దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి గుడి నిర్మాణం

దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి గుడి నిర్మాణం

తమిళనాడు రాష్ట్రానికి చెందిన దింవంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గుడి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతియార్ అనే ఎస్సి వర్గానికి ప్రత్యేకంగా మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు. దీనికి కృతజ్ఝతగా ఆ సామాజిక వర్గానికి చెందిన పదిమంది తమ స్వంత స్థలంలో గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలోని నామక్కల్ జిల్లాలోని కుచ్చికాడు గ్రామంలో కొంతమంది ప్రజలు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. తమ సామాజిక వర్గానికి చేసిన న్యాయానికి, ఆయన చనిపోయిన తర్వాత కృతజ్ఝత చూయించారు. ఈనేపథ్యంలో గ్రామస్థులు ముందుకు వచ్చి పదివేల చదరపు అడుగుల్లో మొత్తం 30 లక్షల రుపాయాలతో కరుణానిధి గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాగా ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కూడ హజరయ్యారు.

దేవుడిని నమ్మని నాస్తికుడు కరుణానిధి..

దేవుడిని నమ్మని నాస్తికుడు కరుణానిధి..

కాగా గుడితోపాటు దానిపక్కనే ఓ లైబ్రరీ, పార్కు, కరుణానిధి తీసుకున్న చారీత్రక నిర్ణయాలను అక్కడ పొందుపర్చనున్నారు. కాగా 2009లో డీఎంకే ప్రభుత్వం దళితులకు 18 శాతం రిజర్వేషన్‌ను విద్యా ఉద్యోగ అవకాశాలతోపాటు ప్రవేట్ సెక్టార్స్‌లలో కూడ రిజర్వేషన్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో అరుణాతియార్ కులం కూడ ఉంది.. ఈ నేపథ్యంలోనే కరుణానిధి అంటే తమకు దైవంతో సమానమని తమకు ఇంత మేలు చేసిన ఆయన్ని దేవుడిగా భావిస్తున్నామనీ అందుకే ఆయనకు గుడి కడుతున్నామనీ అంతియార్ వర్గ పెద్దలు తెలిపారు. అయితే విశేషం ఏమిటంటే కరుణానిధి తాను మొదటి నుండి నాస్తికుడిగా కొనసాగారు. దేవుడిని నమ్మని నాయకుడు చివరకు ప్రజలకు దేవుడుకావడం గమనార్హం.

గతంలో నటి కుష్భూకు గుడి

గతంలో నటి కుష్భూకు గుడి


గతంలో కూడ తమిళనాడులో సినిమా హిరోయిన్ కుష్బుకు ఆమే అభిమానులు గుడి నిర్మించి చరిత్రను సృష్టించారు..అయితే కొద్ది కాలం తర్వాత గుడిని కూల్చివేశారు కూడ. ఇక ఆమేతో పాటు ఇప్పుడు కరుణానిధికి గుడి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలైనా..సినిమా నటులైనా తమిళ ప్రజలు ఒక్కసారి ఆరాధించటం ప్రారంభించారంటే ఎన్నటికీ మరచిపోరు. గుండెల్లో గుడి కట్టి భగవంతుడిగా భావిస్తారు. ఆరాధిస్తారు. తమిళనాడు ప్రజలు నేతలపైనా..నటులపైనా వ్యక్త పరిచే ప్రేమాభిమానాలు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రేమాభిమానాలకు పరాకాష్టలా ఉంటారు తమిళ ప్రజలు. అలా ప్రజల మనస్సుల్ని గెలుసుకున్న నేత దివంగత సీఎం కరుణానిథి కావడంతో ఆయనకు గుడి నిర్మిస్తున్నారు.

English summary
In recognition of contributions made by late DMK Chief M.Karunanidhi towards the upliftment of Arunthathiyar community, it's members conducted a groundbreaking ceremony on Sunday for constructing a temple for the former Chief Minister at Rasipuram in Namakkal district of Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X