వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: దళితుడిపై అగ్రకులాల వారు దాడి..ఏంచేశారో చూడండి

|
Google Oneindia TeluguNews

ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. దళితుడిపై అగ్రకులాలు తమ ప్రతాపం చూపాయి. బులంద్‌షెహర్‌కు చెందిన ఓ దళితుడి కుమారుడు ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొడుకు వయస్సు 21 కాగా ... ఆయన పెళ్లి చేసుకున్న యువతి వయస్సు 18. ఈ వివాహం చెల్లదంటూ అమ్మాయి తరపున బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కోర్టు మాత్రం ఈ ఫిర్యాదును కొట్టివేసే ఇద్దరు మేజర్లు అయినందున వారు కలిసి జీవించే హక్కు ఉందని తీర్పు చెప్పింది.

అమ్మాయి తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేని కారణంగా గ్రామంలోనే పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీకి దాదాపు 100 మంది అగ్రకులానికి చెందిన వారు హాజరయ్యారు. దళితుడైన అబ్బాయి తండ్రిని పంచాయతీలో హాజరుపర్చారు. అక్కడ ఆ 44 ఏళ్ల దళితుడిని చితక బాదారు. అంతేకాదు తన ఉమ్మిన ఉమ్మిని తిరిగి తన చేతే నాకించి చిత్ర హింసలకు గురిచేశారు. అంతేకాదు తన కుటుంబంలోని మహిళలపై అత్యాచారం చేస్తామని వారు బెదిరించినట్లు ఈ దళిత వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే సంఘటన గురించి తెలుసుకున్న అబ్బాయి అమ్మాయి అప్పటికే ఊరు వదిలి వెళ్లిపోయారు.

Dalit man in UP assaulted and made to lick his own spit

ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ముందుగా పోలీస్ స్టేషన్‌కు వెళితే... అక్కడ వారు ఫిర్యాదు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఓ స్థానిక ఛానెల్ పదేపదే కథనాలు ప్రసారం చేయడంతో తప్పని పరిస్థితుల్లో ఫిర్యాదును పోలీసులు స్వీకరించారని దళిత వ్యక్తి చెప్పాడు. వ్యక్తి చెబుతున్న దానిలో వాస్తవం లేదని తాము ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఐదుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు బులంద్‌షర్ పోలీసులు తెలిపారు.

English summary
A Dalit man in Bulandshahr's Sonda Habibpur village was forced to lick his own spit in public because his son married a Muslim. A complaint was filed by the girls parents but then it was rejected by the court as both the boy and girl were majors.later on in the panchayat the dalit man was assaulted by the upper caste people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X