వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీధులెక్కిన దళితులు, ఉద్రిక్తత: ముంబైలో స్కూల్స్ మూత

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: పూణేలో దళితుల ర్యాలీలో చెలరేగిన హింస నేపథ్యంలో ముంబైలో మంగళవారంనాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళితులు వీధులెక్కారు. వారి నిరసన నేపథ్యంలో పాఠశాలలను మూసివేశారు.

ముంబై పలు ఆంక్షలు విధించారు. నలుుగురి కన్నా ఎక్కువ గుమికూడి ఉండడాన్ని నిషేధించారు. పలు విద్యాసంస్థలను మూసివేశారు. రాళ్లు రువ్వుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఒకరిని రక్షించారు.

పుకార్లను నమ్మవద్దని, నిరసనల వల్ల ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని, ప్రస్తుతం సజావుగానే ఉందని, చెంబూరు నాకాలో ట్రాఫిక్ సమస్య ఇంకా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేసే ముందు పోలీసు అధికారుల ద్వారా ధృవీకరించుకోవాలని పోలీసులు ట్వీట్ చేశారు.

భీమా కోరేగావ్ సమరం 200 ఏళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సోమవారం పూణేకు వెళ్తుండగా దళితులపై దాడి జరిగింది. వారి వాహనాలను ధ్వంసం చేశారు.బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బెటాలియన్‌లో ఉన్న దళితులు అగ్రవర్ణాలుగా చెప్పే పీష్వా సైనికులను ఓడించారు. ఆ రోజును విజయ్ దివస్‌గా జరుపుతారు.

వాగ్వివాదాలు, రాళ్లు రువ్వుకోవడం వంటి సంఘటనల తర్వాత సోమవారం సాయంత్రం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకరు మరమించగా, అరడజను మంది దాకా గాయపడ్డారు. 40 వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతుడు అగ్రవర్ణానికి చెందినవాడని పోలీసు చెప్పారు

Dalit Protests Rock Mumbai, Schools Shut, Large Gatherings Banned

ఉద్రిక్తత పెరగకుండా పోలీసులు కొన్ని గంటల పాటు పూణే - అహ్మద్నగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఇంటర్నెట్ సర్వీసులను ఆపేశారు.

కోరేగావ్ సంఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరుతామని, యువకుడి మృతిపై సిఐడి విచారణ కూడా జరిపిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల నష్టపరిహరం ప్రకటించారు. సోమవారంనాడు నాందేడ్‌కు చెదిన రాహుల్ ఫతంగాలే అనే 28 యువకుడు మరణించాడు.

హింసపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథ్‌వాలే అంతకు ముందు కోరారు. తాను ముఖ్యమంత్రితో మాట్లాడానని, సంఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశానని, దోషులను శిక్షించాలని ఆయన చెప్పారు.

English summary
Mumbai local train services were affected on Harbour line between Chembur and Govandi due to protests against violence in Bhima Koregaon violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X