వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలేం జరిగింది?: గుజరాత్‌లో దళితుల రగడ, హెడ్ కానిస్టేబుల్ మృతి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

రాజ్‌కోట్: గుజరాత్ రాష్ట్రంలో దళితుల ఆందోళన ఉధృతమైంది. గిర్-సోమనాథ్ జిల్లాలోని ఉనాలో చనిపోయిన ఆవు చర్మం వొలిచారంటూ దళితులపై జరిగిన దాడి ఘటన మొత్తం గుజరాత్‌లో మొత్తం మంటలు రేపుతోంది. ఈ దాడిలో దెబ్బలు తిన్న ఏడుగురు యవకులు ఆత్మహత్యాయత్నం చేయడంతో వారికి మద్దతుగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి.

ఇందులో భాగంగా గుజరాత్ దళిత ఆందోళన మంగళవారం అహ్మదాబాద్ సహా పలు ఇతర ప్రాంతాలకు విస్తరించింది. మంగళవారం అమ్రేలి పట్టణంలో జరిగిన ఘర్షణల్లో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఘర్షణల్లో భాగంగా రాళ్ల దెబ్బలకు గాయపడ్డ ఓ కానిస్టేబుల్ పంకజ్ అమ్రేలి రాజ్‌కోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Dalit protests spread across Gujarat,

ఈ హింసాత్మక ఘటనలో పదిమంది పోలీసులతో పాటు ఆందోళనకారులు కూడా గాయపడ్డారు. మరోవైపు రాజ్‌కోట్ జిల్లాలోని గోందల్, జాంకండ్‌దోర్నా గ్రామాల్లో ఏడుగురు యువకులు సోమవారం విషం తాగి ఆత్మాహుతికి యత్నించారు. దీంతో గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి.

అల్లర్లు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు పాకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున దళిత యువకులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో గల జునాగఢ్, జాంనగర్, రాజ్‌కోట్, అమ్రేలి జిల్లాలలో మంగళవారం పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి పట్టణ రహదారులపై చచ్చిన గోవులను పడేసి దళితులు నిరసన తెలిపారు. వాటిని తీసివేయడానికి పోలీసులు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అంతక ముందు ఆందోళనకారులు అనేకచోట్ల బస్సులపై రాళ్లదాడి జరిపారు.

అసలేం జరిగింది?:
గత వారం రాజ్‌కోట్‌ జిల్లా యునా, జునాగఢ్‌ జిల్లా బాత్వా గ్రామాలకు చెందిన ఏడుగురు దళితులపై గో పర్యవేక్షణా కార్యకర్తలు దాడిచేశారు. గోవులను చంపి, చర్మం వొలుస్తున్నారంటూ వాళ్లని తాళ్లతో కట్టేశారు. తాము చచ్చిన గోవుల చర్మం తీస్తున్నామని చెప్పినా వినిపించుకోకుండా కొట్టారు. దీంతో మనస్థాపం చెందిన ఏడుగురు యువకులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

English summary
Dalit protests in Gujarat spread to several parts of the state including Ahmedabad on Tuesday unleashing violence in which a head constable was killed in stone pelting and state transport buses attacked while three more members of the community allegedly attempted suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X