వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదుగురు మహిళల్ని బట్టలు ఊడదీసి, నగ్నంగా ఊరేగించారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. ఐదుగురు దళత మహిళల దుస్తులు విప్పి బహిరంగంగా నిలబెట్టారు. ఈ సంఘటన షాజహాన్ పూర్ జిల్లా జలాలాబాద్‌లోని బడే హరెవా గ్రామంలో చోటు చేసుకుంది.

ఓ దళిత యువకుడితో అగ్రవర్ణ కులానికి చెందిన బాలిక వెళ్లిపోయింది. దీనికి ప్రతీకారంగా ఐదుగురు మహిళలను నగ్నంగా నిలబెట్టారు.

Women

బాలిక కుటుంబానికి చెందిన వారు.. దళిత యువకుడి కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళల చుట్టూ నిలబడ్డారు. యువకుడి కుటుంబంలో అతని తల్లి, అత్తా, చిన్నమ్మలు ఉన్నారు. బాలిక కుటుంబ సభ్యులు నడి రోడ్డు పైన వారి దుస్తులు విప్పారు.

అంతేకాదు, వారిని అలాగే గ్రామంలో తిప్పారు. కర్రలు తదితర వాటితో కొట్టుతూ ఊరంతా తిప్పారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు... బాలిక కుటుంబ సభ్యులు వారిని శనివారం నాడు ఇంట్లో నుండి బయటకు లాక్కొచ్చారు. వారి దుస్తులను చించేశారు.

ఆ మహిళలు తిరగబడితే.. కొట్టారు. అలాగే, దుస్తులు లేకుండా కొట్టుకుంటూ ఊరంతా తిప్పారు. మార్కెట్ ప్రాంతంలో అరగంట పాటు అలాగే కూర్చుండబెట్టారు. అంతలో కొందరు వచ్చి బాలిక తల్లిదండ్రుల తీరును తప్పు పడుతూ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
In a shocking incident, five Dalit women were stripped and paraded naked in Bade Harewa village in Jalalabad in Shahjahanpur district. The incident was in retaliation against the elopement of an upper caste girl with a Dalit youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X