వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛీ.. దీన‌మ్మా జీవితం..!పేరుకు విమానాల్లో ఉద్యోగం..!మూడు నెల‌ల‌వుతున్నా జీతానికి దిక్కులేదు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఛీ.. దీన‌మ్మా జీవితం..! 3 నెల‌ల‌వుతున్నా జీతానికి దిక్కులేదు..!! | Oneindia Telugu

దిల్లీ/హైద‌రాబాద్: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో..! చెప్పుకోవ‌డానికి చేసే కొలువు ఎంత గొప్ప‌దైనా ఏం
లాభం..? జీతాలు స‌రిగా ఇవ్వ‌న‌ప్పుడు స్క్రాబ్ దుకాణ‌మైనా, అంత‌ర్జాతీయ సంస్థ ఐనా ఒక‌టే..! జెట్ ఎయిర్‌వేస్‌ కొన్ని రోజులుగా సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం ఆ సంస్థ ఉద్యోగులను కూడా తాకింది. తాజాగా ఈ సంస్థ ఛైర్మన్‌ నరేష్ గోయెల్ సైతం తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

గోవా కుర్చీపై కొత్త సీఎం ధీమా.. అటు కాంగ్రెస్ మార్క్.. రిసార్టుకు చేరిన రాజకీయం గోవా కుర్చీపై కొత్త సీఎం ధీమా.. అటు కాంగ్రెస్ మార్క్.. రిసార్టుకు చేరిన రాజకీయం

అయితే కొంత కాలంగా ఉద్యోగులకు వేతనాలు అందివ్వడంలో కూడా ఈ సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంోంది. దీంతో జెట్‌ పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్(డీజీసీఏ)కు ఎయిర్‌వేస్‌ ఇంజినీర్ల సంక్షేమ సంఘ ప్రతినిధులు లేఖ రాశారు. 'ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రభావం మేం చేసే పనిమీద కూడా పడుతోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో పనిచేసే ప్రతి ఇంజినీరు పరిస్థితి ఇలాగే ఉందని ఆ లేఖ‌లో ద‌య‌నీయంగా పేర్కొన్నారు.

Dammit.. Jobs in flights..! but no salaries for three month..!!

ఇంజినీర్ల మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల ఇండియాలో, ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాల భద్రత ప్రమాదంలో పడుతోంది. సీనియర్ అధికారులు ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. గత ఏడు నెలలుగా జెట్‌ ఎయిర్‌వేస్‌లో సంక్షోభం తలెత్తింది.

దీంతో మాకు మూడు నెలలుగా జీతాల్లేవు' అని ఇంజినీర్ల సంఘం లేఖలో తాజా ప‌రిస్థితుల‌ను దారుణంగా వివ‌రించింది. జెట్‌ ఎయిర్‌వేస్ ఖజానాలో నిధులు లేకపోవడంతో ఈ సంస్థకు చెందిన కొన్ని ప్రధాన విమానాలను నడపడం ఆపేసింది. 41 విమానాలకు అద్దె చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో వాటిని విమానాశ్రయాలకే పరిమితం చేసింది. దీంతో జెట్ ఎయిర్ వేస్ సంక్ష‌భం ఎప్పుడు స‌మ‌సి పోతుందో..త‌మ‌కు ఎప్పుడు జీతాలు చేతులో ప‌డ‌తాయా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

English summary
Jet Airways has been experiencing crisis for some days. This impact also hit the company's employees. Naresh Goel, chairman of the company, is also ready to withdraw from his tenure. However, the company is struggling to provide salaries to employees for three months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X