వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేంజర్ బెల్స్ .. కరోనా కొత్త కేసుల నమోదులో ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఇండియా

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి 4,200,953 మందికి వ్యాధి సోకింది. మరియు ఈ వ్యాధి నుండి మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 284,150 కు చేరింది . ఇక ఇప్పటికి రికవర్ అయిన వాళ్ళ జాబితా చూస్తే 1,502,591 గా ఉంది . అమెరికాలో తాజాగా మొత్తం కేసుల సంఖ్య1,367,963 కి చేరింది. ఇక అమెరికాలో 20, 329 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
అమెరికా తర్వాత రష్యాలో 221,344 కేసులు నమోదు కాగా ...11,656 కొత్తకేసులొచ్చాయి. అలాగే బ్రెజిల్‌లో 162,699 కేసులు నమోదు కాగా 6,638... కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక కొత్త కేసులు పెరుగుతున్న దేశాల్లో నాల్గవ స్థానంలో చేరింది ఇండియా .

కరోనా లాక్ డౌన్ దెబ్బకు అప్పుల్లో తెలంగాణా: కేంద్రం ఆదుకోకుంటే కష్టమే !!కరోనా లాక్ డౌన్ దెబ్బకు అప్పుల్లో తెలంగాణా: కేంద్రం ఆదుకోకుంటే కష్టమే !!

ఇక ఇండియా విషయానికి వస్తే 67,161 కేసులు నమోదు కాగా , 4,353 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అంటే వేగంగా కేసులు పెరుగుతున్న దేశాలలో ఇండియా నాలుగవ స్థానంలో చేరింది. ఇక ఇండియా తరువాత స్థానాలలో యూకే , పెరు, మెక్సికో, సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి. అత్యంత వేగంగా కేసులు పెరుగుతున్న దేశాల జాబితాలో ఇండియా నాలుగవ స్థానంలో చేరటం భారతీయులను ఆందోళనకు గురి చేస్తుంది.

Danger Bells .. India is worlds fourth largest country of new corona cases growth

Recommended Video

COVID 19 Infected to 300 In AP Through 40 Super Spreaders

ఇప్పుడు ఇండియాలో కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. కరోనా లాక్ డౌన్ పొడిగించినా కొన్ని సడలింపులు ఇచ్చి జనజీవనం ఆగకుండా కొనసాగేలా చేస్తుంది . ఒక్క రోజులో 4,353 కొత్త కేసులు నమోదు అయ్యాయి అంటే ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్ధం చేసుకోవచ్చు . ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 67,161కి చేరింది. ఇక ఇండియాలో కరోనా కంట్రోల్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది . ఇది ఎక్కడిదాకా వెళ్తుంది అనేది మాత్రం ఇంకా అంచనా వెయ్యలేకుండా ఉంది . కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. లాక్‌డౌన్ ఉంటే ఓ సమస్య... లేకపోతే మరో సమస్య లా ఉంది . ఏది ఏమైనా దేశంలో కరోనా కొత్త కేసుల నమోదులో ప్రపంచ దేశాలలో నాల్గవ స్థానంలో ఉంది అంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే .

English summary
Coronavirus worldwide infects 4,200,953 people. And the number of people who died from the disease has now reached 284,150. The list of those recovered so far is 1,502,591. The latest total number of cases in the US reached 1,367,963. 20, 329 new cases were reported in the US.Russia registered 221,344 new cases, followed by the US with 11,656 new cases. In Brazil, there were 162,699 cases and 6,638 new cases. India is the fourth largest number of new cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X