వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శానిటైజేషన్ టన్నెల్స్ తో డేంజర్ ... హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత దేశంలో కూడా కరోనా ప్రతాపాన్ని చూపిస్తుంది. కరోనా వైరస్ ను అరికట్టటానికి ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , వస్తువులపైన కూడా కరోనా వైరస్ జీవిస్తుంది కాబట్టి వస్తువుల వినియోగంలో కూడా జాగ్రత్త వహించాలని దేశ పౌరులకు చెప్పిన దేశాలు చివరకు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో శానిటైజేషన్ టన్నెల్స్ ఏర్పాటు చేశాయి. దీంతో ఏ వాహనం అయినా మనుషులైనా సరే ఆ టన్నెల్ లోకి వెళ్లి వస్తే వారు శానిటైజ్ అవుతారు. అయితే ఈ శానిటైజేషన్ టన్నెల్స్ తో డేంజర్ అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యులు .

గాంధీ మెడికల్ కాలేజీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా .. టెన్షన్ లో వైద్య సిబ్బందిగాంధీ మెడికల్ కాలేజీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా .. టెన్షన్ లో వైద్య సిబ్బంది

శానిటైజేషన్ టన్నెల్స్ లో ఉపయోగించే సోడియం హైపోక్లోరైట్‌ తో ప్రమాదం

శానిటైజేషన్ టన్నెల్స్ లో ఉపయోగించే సోడియం హైపోక్లోరైట్‌ తో ప్రమాదం

బహిరంగ ప్రదేశాల్లో రోడ్లపైకి వచ్చే వాహనాలను సురక్షితంగా ఉంచేందుకు, వాటి ద్వారా ఎవరికీ కరోనా రాకుండా ఉండేందుకు శానిటైజేషన్‌ టనెల్స్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ టన్నెల్‌లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని ఉపయోగించి శానిటైజేషన్‌ నిర్వహిస్తున్నారు. అయితే సోడియం హైపోక్లోరైట్‌ తో మనిషి కళ్లకు, చర్మానికి హాని కలుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డిస్‌ఇన్‌ఫెక్టంట్‌ టనెల్స్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది .

మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ


సోడియం హైపోక్లోరైట్ ఉపరితలంతో పాటు కంటికి కనిపించని సూక్ష్మ పదార్థాలపై మాత్రమే పని చేస్తుందని అది కాస్త లిమిట్ లో వినియోగిస్తే పర్వాలేదు కానే అధిక మోతాదులో వాడితే అది మానవుల శరీరానికి హాని చేస్తుందని పేర్కొంది . అంతేగాక సోడియం హైపోక్లోరైట్‌లో ఉపయోగించే ఆల్కాహాల్‌, క్లోరిన్‌ పదార్థాలు అప్పటికే మానవ శరీరంలోకి చొచ్చుకుపోయిన వైరస్‌ను పూర్తిగా నశింపజేయలేదని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇది కళ్లలో ఉండే మ్యూకస్‌ మెంబ్రేన్‌ వంటి సున్నితమై పొరతో పాటు నోటికి హాని కలిగించే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్న నేపధ్యంలో ఇష్టారాజ్యంగా వినియోగం మంచిది కాదని పేర్కొంది .

 కేవలం 0.5 శాతం మాత్రమే ఉపయోగించాలని చెప్పటంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ

కేవలం 0.5 శాతం మాత్రమే ఉపయోగించాలని చెప్పటంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ


ఇక ఎక్కడ సోడియం హైపోక్లోరైట్ వాడినా ఉపరితలం మీద కేవలం 0.5 శాతం మాత్రమే ఉపయోగించాలని తెలిపింది. అయితే డబ్ల్యుహెచ్‌వో సూచనలు పాటించకుండా బహిరంగ ప్రదేశాల్లో వెహికల్‌ టనెల్స్‌ ఏర్పాటు చేసి ఎక్కువ మోతాదులో ద్రవణం ఉపయోగిస్తుండడంతో ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది .దీంతో దీని వినియోగంపై అప్రమత్తం అయ్యింది . ఎక్కడైనా సరే రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన వెహికల్‌ టన్నెల్స్‌ లో అధిక మోతాదులో సోడియం హైపోక్లోరైట్ వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ వినియోగించినా తక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు.

Recommended Video

Fake News Buster : 07 'హెలికాఫ్టర్ నుంచి ప్రజలకు డబ్బులు జారవిడుస్తున్న ప్రభుత్వం' ఇందులో నిజమెంత ?

English summary
Sanitization tunnels have been set up to keep vehicles safe on public roads and prevent corona from getting through them. Sanitization is performed using sodium hypochlorite solution in tunnels. Doctors say that sodium hypochlorite can cause damage to the eyes and skin of humans. The World Health Organization has stated this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X