వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ్యాట్సాప్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ : నదిలో చిక్కుకున్న కార్మికులను కాపాడిన సైనికులు (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

నదిలో చిక్కుకున్న కార్మికులను కాపాడిన సైనికులు (వీడియో)

శ్రీనగర్ : నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద పనులు జరుగుతున్నాయి. ఇద్దరు కార్మికులు పనిచేస్తున్నారు. ఇంతలో వరద ప్రవాహం పొంగి వచ్చింది. అక్కడే గోడ మీద బిక్కు బిక్కుమని కూర్చొన్న వారికి .. ఆపన్నహస్తం అందించారు భారత వాయుసేన సైనికులు. ఓ వైపు వరద ప్రవాహం పొంగిపొర్లుతుండగా .. తాడు సాయంతో వారిని కాపాడి .. పున:ర్జన్మనిచ్చారు.

జమ్ముకశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద నిర్మాణం కొనసాగుతున్నాయి. బ్రిడ్జి పనులు సాగుతుండగా .. ఇద్దరు కార్మికులు కూడా ఉన్నారు. అయితే వర్ష బీభత్సానికి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇంకేముంది తావి నది నుంచి కూడా నీరు ఉప్పొంగి ప్రవహించింది. నీటిని గమనించిన కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడే ఉన్న గోడపైకి ఎక్కి కూర్చొన్నారు. బిక్కుబిక్కుమంటూ సాయం అందించాలని చూశారు. వారిని భాతర వాయుసేన గమనించింది. వెంటనే వారికి సాయం చేసేందుకు రంగంలోకి దిగింది.

Daring Indian Air Force operation pulls 2 men stranded in Tawi river to safety

వెంటనే ఎయిర్‌ఫోర్స్ టీం రంగంలోకి దిగారు. వారి లోకేషన్ చూసుకొని .. విమానం నుంచి ఒక సైనికుడు కిందకి దూకాడు. అతని లైఫ్ జాకెట్ వేసుకొన్నాడు. మరో ఇద్దరికీ కూడా లైఫ్ జాకెట్ తీసుకొచ్చారు. వారికి జాకెట్ వేసి .. పైకి పంపించారు. వారు పైకి వెళ్లగా .. తర్వాత సైనికుడు కూడా వచ్చారు. అలా వరద నీటిలో చిక్కుకున్న వారిని భారత వాయుసేన సైనికులు కాపాడారు. ఈ ఆపరేషన్‌ను ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ టెలీకాస్ట్ చేసింది. మరోవైపు వాయుసేన సైనికుల పరాక్రమాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. శెభాష్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

English summary
the Indian Air Force launched a daring rescue mission Monday afternoon after four men were caught in an overflowing river in Jammu and Kashmir. The men were rescued from near an under-construction bridge over the Tawi river, which flows through Jammu. Two of the men rescued sought refuge on a pier attached to one of the under-construction bridge's pillars. Dramatic visuals from the river side showed the men swimming in the river and climbing on to the pier to save themselves from getting swept away in the flowing river. Reportedly, the men were in the river to fish. However, a sudden increase in the river's flow due to heavy rains led to the men getting stranded in the river.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X