బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Dasara: మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభించిన రాష్ట్రపతి, చరిత్రలో ఫస్ట్ టైమ్, పండగ !

|
Google Oneindia TeluguNews

మైసూరు/బెంగళూరు: ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సోమవారం ఉదయం మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మైసూరులోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో మైసూరు దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రారంభించారు. నవరాత్రి ఉత్సవాలు కూడా ఈరోజు నుంచి ప్రారంభం అవుతాయి. కర్ణాటక గవర్నర్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తో పాటు కేంద్ర మంత్రులు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Actress: నటి ఆత్మహత్య కేసులో ట్విస్ట్, సిరాజుద్దీన్ కు నోటీసులు, దీపా ఐఫోన్ లో ? !Actress: నటి ఆత్మహత్య కేసులో ట్విస్ట్, సిరాజుద్దీన్ కు నోటీసులు, దీపా ఐఫోన్ లో ? !

 ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు దసరా ఉత్సవాలు

ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు దసరా ఉత్సవాలు

మైసూరు దసరా ఉత్సవాలు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కర్ణాటకతో పాటు దేశ విదేశాల నుంచి మైసూరు దసరా ఉత్సవాలు వీక్షించడానికి లక్షలాది మంది వస్తుంటారు. కరోనా వైరస్ పుణ్యమా అంటూ గత రెండు సంవత్సరాలు మైసూరు దసరా ఉత్సవాలు ప్రత్యక్షంగా చూడటానికి ప్రజలకు అవకాశం లేకుండా పోయింది.

 రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రాంరంభం

రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రాంరంభం

మైసూరు దసరా ఉత్సవాలు రాష్ట్రపతి ప్రారంభించడం ఇదే మొదటి సారి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో మైసూరులోని మండకళ్ళి విమానాశ్రయం చేరుకున్నారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గోహ్లేట్, కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ తదితరులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వాగతం పలికారు.

 చాముండేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు

చాముండేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు

మండకళ్ళి విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేరుగా చాముండేశ్వరి కొండకు చేరుకున్నారు. మైసూరులోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంబించారు.

 భారీ బందోబస్తు

భారీ బందోబస్తు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక సందర్బంగా మైసూరు నగరంతో పాటు చాముండేశ్వరి కొండ, ఆ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు ప్రైవేటు వాహనాల రాకపోకలు నిషేధించారు. మైసూరు దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రారంభించడంతో కన్నడిగులు సంతోషించారు.

English summary
Dasara: President Draupadi Murmu inaugurates Mysuru Dasara Festival in Mysuru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X