వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ తొలి మంత్రి దత్తాత్రేయ: బాధలేదని హేమమాలిని

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో 29 రాష్ట్రంగా ఆవిర్బవించిన తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా పదవీ బాద్యతలు చేపట్టిన తొలి ఎంపీగా బండారు దత్తాత్రేయ అరుదైన ఘనతను సాధించారు. సికింద్రాబాద్ నుంచి నాలుగోసారి ఎంపీగా గెలిచిన దత్తాత్రేయ సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో వాజ్ పేయ్ హయాంలో కేంద్రమంత్రిగా పదవీ బాద్యతలు నిర్వర్తించారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలు, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కృషి చేస్తానని సుజనా చౌదరి తెలిపారు. కేంద్రమంత్రి వర్గంలో సుజనకు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఆయన ఆదివారం సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన తేనేటి విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశం, ప్రభుత్వం, రాష్ట్రం గురించి అన్ని విషయాలు మోడీ చెప్పారని, అందరూ కలిసి మెలసి చక్కగా పని చేయాలని చెప్పారన్నారు. మంత్రి వర్గంలో ఏ హోదా ఇచ్చారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ఆ విషయం తెలియదని, తనకు లెటర్‌ పంపించారని, ఆ లెటర్‌ చూస్తే తెలుస్తుందని చెప్పారు.

Dattatreya is Telangana's first cabinet minister

తమకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని కొత్తగా ఎన్నికైన కేంద్రమంత్రులు పేర్కొన్నారు. మోడీ ఏ బాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తామని మనోహర్‌ పారికర్‌ తెలిపారు. మోడీ ఇచ్చిన తేనేటి విందులో పాల్గొన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

తాను స్వతంత్ర హోదాతో మంత్రి పదవి చేపడతానని తెలిపారు. మంత్రులకు బీజేపీ ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పదవి రాలేదని బాధలేదని సీనియర్‌ ఎంపీ హేమామాలిని అన్నారు. మధుర ఎంపీగా తన నియోజక వర్గ ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పారు.

ప్రమాణ స్వీకారానికి ముందు మోడీ తన నివాసంలో మంత్రులకు తేనేటి విందు ఇచ్చారు. కాగా, మనోహర్ పారికర్‌కు రక్షణశాఖ, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీకి మైనార్టీ సంక్షేమం, దత్తాత్రేయకు కార్మికశాఖ, సుజనాచౌదరికి వాణిజ్య సహాయశాఖ దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
Bandaru Dattatreya is Telangana's first cabinet minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X