చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Daughter affair: బుద్ది మాటలు చెప్పిన తండ్రి, ప్రియుడితో కలిసి తండ్రిని చంపేసింది, డ్రామాలు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ లక్నో: పెళ్లి వయసుకు వచ్చిన యువతి ఓ యువకుడితో కలిసి తిరుగుతోంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి నుంచి వెలుతున్న యువతి ఆమె ప్రియుడితో కలిసి జల్సాలు చేసింది. కూతురి వ్యవహారం ఆమె తండ్రికి తెలిసింది. నువ్వు పద్దతి మార్చుకోవాలని, మేము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలని, నీకు ఏమి కావాలన్నా మేము అండగా ఉంటామని తండ్రి అతని కూతురికి బుద్దిమాటలు చెప్పాడు. ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న కూతురికి తండ్రి చెప్పే బుద్దిమాటలు చేదు అయ్యాయి. పొలం దగ్గర ఉన్న తండ్రిని ప్రియుడితో కలిసి ఇనుపరాడ్లతో దాడి చేసి చంపేసింది. తరువాత తండ్రి శవాన్ని చెట్టుకు వేలాడదీసి నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని కూతురే పోలీసు కేసు పెట్టి డ్రామాలు ఆడింది.

Torture: భర్తకు డబ్బు పిచ్చి, మామకు కోడలి పిచ్చి, పడక సుఖం కోసం ?, ఒకే ఇంట్లో ఏంజరిగిందంటే !Torture: భర్తకు డబ్బు పిచ్చి, మామకు కోడలి పిచ్చి, పడక సుఖం కోసం ?, ఒకే ఇంట్లో ఏంజరిగిందంటే !

 పెళ్లి వయసుకు వచ్చిన కూతురు

పెళ్లి వయసుకు వచ్చిన కూతురు

ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలోని ముటైన్ గ్రామంలో హర్పాల్ సింగ్ అనే ఆయన నివాసం ఉంటున్నాడు. హర్పాల్ సింగ్ కు ప్రీతి (23) అనే కూతురు ఉంది. ప్రీతికి పెళ్లి వయసు రావడంతో ఆమెకు మంచి వరుడిని చూసి పెళ్లి చెయ్యాలని నిర్ణయించిన తండ్రి హర్పాల్ సింగ్ పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు.

 ప్రియుడితో కూతురి జల్సాలు

ప్రియుడితో కూతురి జల్సాలు

బడాన్ సమీపంలోని పాటేసి ప్రాంతంలో నివాసం ఉంటున్న ధర్మేంద్ర అనే యువకుడు ప్రీతికి పరిచయం అయ్యాడు. ధర్మేంద్ర, ప్రీతి ప్రేమించుకున్నారని సమాచారం. ప్రియుడు ధర్మేంద్రతో కలిసి ప్రీతి ఎంజాయ్ చేస్తోంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి నుంచి వెలుతున్న ప్రీతి ఆమె ప్రియుడు ధర్మేంద్రతో కలిసి జల్సాలు చేసింది.

 వాడు పెద్ద వెదవ...... మేము చెప్పింది విను

వాడు పెద్ద వెదవ...... మేము చెప్పింది విను

కూతురు ప్రీతి వ్యవహారం ఆమె తండ్రి హర్పాల్ సింగ్ కు తెలిసింది. ధర్మంద్ర పెద్ద వెదవ, పనిపాట లేకుండా తిరుగుతున్నాడని ప్రీతి తండ్రి హర్పాల్ సింగ్ తెలుసుకున్నాడు. నువ్వు పద్దతి మార్చుకోవాలని, మేము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలని, నీకు ఏమి కావాలన్నా మేము అండగా ఉంటామని తండ్రి హర్పాల్ సింగ్ అతని కూతురు ప్రీతికి మంచిగా బుద్దిమాటలు చెప్పాడు.

 తండ్రి మీద రగిలిపోయిన ప్రీతి

తండ్రి మీద రగిలిపోయిన ప్రీతి

ప్రియుడు ధర్మేంద్రతో కలిసి ఎంజాయ్ చేస్తున్న కూతురు ప్రీతికి ఆమె తండ్రి హర్పాల్ చెప్పే బుద్దిమాటలు చేదు అయ్యాయి. తండ్రి మాటలు లెక్కచెయ్యకుండా ప్రీతి ఇంకా ఎక్కువగా ప్రియుడు ధర్మేంధ్రతో తిరుగింది. తన కూతురు ప్రీతి చెప్పినమాట వినలేదని కోపంతో గత నెల తండ్రి హర్పాల్ సింగ్ ఆతని కూతురు ప్రీతిని చికతబాదేశాడు.

 ప్రియుడితో కలిసి తండ్రిని కొట్టి చంపిన కూతురు

ప్రియుడితో కలిసి తండ్రిని కొట్టి చంపిన కూతురు

ప్రియుడు ధర్మేంద్ర మోజులో పడిపోయిన ప్రీతి కుటుంబ విలువలు మరిచిపోయింది. తన తండ్రి బతికుంటే తన విలాసాలకు, తన తిరుగుడికి, తన పెళ్లికి అడ్డు వస్తాడని భయపడిన ప్రీతి తండ్రి హర్పాల్ సింగ్ ను చంపేయాలని డిసైడ్ అయ్యింది. తన తండ్రిని చంపడానికి నువ్వు సహకరించాలని, తరువాత మనం పెళ్లి చేసుకుందామని ప్రియుడు ధర్మేంద్రకు ప్రీతి చెప్పింది. జులై 19వ తేదీన పొలం దగ్గరకు వెళ్లి పనులు చేస్తున్న హర్పాల్ సింగ్ మీద కూతురుప్రీతి, ప్రియుడు ధర్మేంద్ర దాడి చేశారు. ప్రీతి, ఆమె ప్రియుడు ధర్మేంద్ర ఇనుపరాడ్లతో ధర్మేంద్ర తల మీద బలంగా దాడి చెయ్యడంతో అతని ప్రాణాలు పోయాయి.

 నాటకాలు ఆడిన కూతురు

నాటకాలు ఆడిన కూతురు

ధర్మేంద్రను చంపేసిన తరువాత అతని శవాన్ని చెట్టుకువేలాడదీశారు. తన తండ్రి హర్పాల్ సింగ్ పొలంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని కూతురు ప్రీతి పోలీసులకు సమాచారం ఇచ్చి డ్రామాలు ఆడింది. కేసు విచారణ చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ధర్మేంద్ర తల మీద ఇనపరాడ్లతో దాడి చేసి చంపేశారని పోస్టుమార్టుం నివేదికలో వెలుగు చూసింది.

 రియల్ స్టోరీ మొత్తం చెప్పిన కూతురు

రియల్ స్టోరీ మొత్తం చెప్పిన కూతురు

పోలీసుల విచారణలో ప్రీతి లవ్ స్టోరీ బయటపడింది. పోలీసులు ప్రీతిని అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా స్టోరీ మొత్తం చెప్పింది. ప్రీతి, ఆమె ప్రియుడు ధర్మేంద్రను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. కూతురి తిరుగుడు మానుకోవాలని బుద్దిమాటలు చెప్పిన తండ్రి హర్పాల్ సింగ్ అదే కూతురు చేతిలో హత్యకు గురి కావడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

English summary
Daughter affair: A shocking incident has been reported from Sambhal district of Uttar Pradesh where a girl allegedly got her father murdered after he refused to let her marry her boyfriend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X