వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్రూవర్‌నవుతా: 26/11 కేసులో నిందితుడు హెడ్లీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: తనకు క్షమాభిక్ష ప్రసాదిస్తే ముంబై 26/11 దాడుల కేసులో అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమని పాకిస్థానీ - అమెరికన్ లష్కరే ఉగ్రవాది డేవిడ్ కొల్‌మన్ హెడ్లీ ప్రతిపాదించాడు. ప్రస్తుతం అమెరికా జైలులో శిక్షను అనుభవిస్తున్న హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ముంబైలోని సెషన్స్ కోర్టు జడ్జి జీఏ సనాప్ విచారించారు.

తనపై మోపిన 26/11 అభియోగాలను అంగకరించాడని కోర్టు విచారణ ముగిసిన తర్వాత ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్‌ నికమ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై దర్యాప్తు అధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని సెషన్స్ కోర్టు జడ్జిని ఉజ్వల్‌ నికమ్‌ కోరారు.

David Headley

దీంతో హెడ్లీని అప్రూవర్‌గా మార్చుతూ న్యాయమూర్తి జీఏ సనప్‌ ఉత్తర్వులిచ్చారు. ఫిబ్రవరి 8న ప్రభుత్వం తరఫున సాక్షిగా హెడ్లీ వాంగ్మూలం ఇవ్వనున్నాడు. 26/11 ముంబై దాడులకు సంబంధించి పాకిస్థాన్‌లో జరిగిన కుట్ర వివరాలు ఈ సందర్భంగా బట్టబయలయ్యే అవకాశముంది.

'నేను కోర్టు ముందు హాజరయ్యాను. ముంబై కోర్టు నాకు క్షమాభిక్ష పెడితే 26/11 ముంబై దాడి కేసుకు సంబంధించి అడిగే ఏ ప్రశ్నలకైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను' అని హెడ్లీ పేర్కొన్నాడు. ముంబై కోర్టు ఆదేశాల మేరకు అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

English summary
David Coleman Headley, the Pakistani American who scouted targets for the 26/11 terror attacks in 2008 by the Lashkar-e-Toiba, was granted pardon by a Mumbai special court and made an approver and a witness in the case against plotter Zabiuddin Ansari alias Abu Jundal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X