వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నోట్ల రద్దు: దావూద్‌కు బిగ్ షాక్, రూ.100పై కన్ను, కానీ..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ హఠాత్ ప్రకటనతో అందరూ నివ్వెరపోయారు. ఈ రోజు (గురువారం) నుంచి పలు బ్యాంకులలో రూ.2000 నోట్లతో మార్చుకునే అవకాశమిచ్చారు.

నోట్ల రద్దు అంశం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కూడా షాకిచ్చిందని చెప్పవచ్చు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో దావూద్ రూ.100 నోట్ల పైన చర్చించాడని తెలుస్తోంది.

దావూద్ అండ్ కంపెనీ ఫేక్ వంద రూపాయల నోట్ల పైన దృష్టి సారించిందని తెలుస్తోంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణంగా దావుద్ అండ్ కంపెనీకి రూ.5వేల కోట్ల నష్టం జరిగినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది.

Dawood gang speaks of faking the Rs 100 note now

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఫేక్ రూ.100 నోట్ల అంశం పైన దావూద్ గ్యాంగ్ చర్చించిందని తెలుస్తోంది. తమ బిజినెస్ నడపాలంటే అదే మార్గమని భావించారని తెలుస్తోంది.

ఫేక్ వంద రూపాయల నోట్లు మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు. అయితే, రూ.వంద ఫేక్ నోటు తయారు చేస్తే లాభం ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు దానిని సాగకపోవచ్చునని భావిస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్లు తయారు చేసినప్పుడు లాభం ఎక్కువగా ఉండేది.

రూ.500, రూ.1000 లేదా రూ.100 ఏ ఫేక్ నోట్లు తయారు చేసినా దాదాపు ఒకే ఖర్చు అవుతుంది. కాబట్టి అది సక్సెస్ కాకపోవచ్చునని, ఓ సమయానికి ఆగిపోవచ్చునని భావిస్తున్నారు. అంతేకాకుండా, దావూద్ గ్యాంగ్ ఈ ఆలోచనను కూడా పక్కన పెట్టవచ్చునని భావిస్తున్నారు.

English summary
Is the Dawood Ibrahim syndicate now looking to fake the Rs 100 note? With the ban being announced on the Rs 500 and 1,000 note, his industry has taken a major hit and Intelligence Bureau officials estimate the loss at Rs 5,000 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X