వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మృతి: తేల్చి చెప్పిన ఛోటా షకీల్: అదే జరిగితే?

అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చాల ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని, మీరు అనుకున్నట్లు ఆయనకు ఏమీ జరగలేదని అతని ముఖ్య అనుచరుడు ఛోటా షకీల్ ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నించాడు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చాల ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని, మీరు అనుకున్నట్లు ఆయనకు ఏమీ జరగలేదని అతని ముఖ్య అనుచరుడు ఛోటా షకీల్ ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నించాడు.

దావూద్ ఇబ్రహీం మరణించాడని, కాదు కారిచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని పాకిస్థాన్ మీడియాలో వచ్చినవన్నీ కేవలం వందతులు అంటూ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఛోటా షకీల్ స్పష్టం చేశాడు.

దావూద్ సూపర్ గా ఉన్నాడు

దావూద్ సూపర్ గా ఉన్నాడు

దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఆయన ఆరోగ్యం గురించి పాకిస్థాన్ మీడియాలో వచ్చిన వార్తలు అపద్దం అంటూ ఛోటా షకీల్ వివరణ ఇచ్చాడు.

శుక్రవారం మొదలు

శుక్రవారం మొదలు

దావూద్ ఇబ్రహీం మరణించాడని శుక్రవారం నుంచి పాకిస్థాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయనకు తీవ్ర గుండెపోటు కారణంగా కరాచీలోని ఆగాఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కథనాలు వచ్చాయి.

విషమ పరిస్థితి

విషమ పరిస్థితి

కరాచీలోని ఆగాఖాన్ ఆసుపత్రిలో దావూద్ ఇబ్రహీం విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడని, అతడు గత కొం త కాలంగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపుతున్నాడని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.

నాగొంతు ఎలాగుంది ?

నాగొంతు ఎలాగుంది ?

ఈ విషయంపై కరాచీ నుంచి భారత్ మీడియాతో ఛోటా షకీల్ మాట్లాడాడు. నాగొంతు వింటే దావూద్ భాయ్ విషయంలో ఏమైనా జరిగినట్లు మీకు అనిపిస్తోందా ? అంటూ ప్రశ్రించాడు. భాయ్ హ్యాపీగా ఉన్నారని ధీమాగా చెప్పాడు.

వాంటెడ్ క్రిమినల్

వాంటెడ్ క్రిమినల్

దావూద్ ఇబ్రహీం కోసం భారత్ పోలీసులు అనేక సంవత్సరాల నుంచి గాలిస్తున్నారు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం ప్రధాన నిందితుడు. అతడిని పట్టుకోవడం కోసం భారత్ చాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

English summary
The 61-year-old underworld don suffered a heart attack and was admitted to the Aga Khan Hospital in the city, according to unverified reports. But Dawood Ibrahim's close aide Chhota Shakeel dismissed the reports, saying he was fine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X