• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత క్రికెటర్లకు దావూద్ కార్ల ఆఫర్: వెంగ్ సర్కార్

|

Dawood Ibrahim
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1986లో జరిగిన ఆస్ట్రేలియా-ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ జట్టును ఓడిస్తే భారత జట్టులోని ప్రతీ సభ్యునికి బహుమతిగా కారు ఇచ్చేందుకు దావూద్ ఇబ్రహీం ముందుకు వచ్చాడని వెంగ్ సర్కార్ జాతీయ మీడియాకు తెలిపారు.

మ్యాచ్ జరిగే ముందు దావూద్ ఇబ్రహీం తమ డ్రెస్సింగ్ రూంను సందర్శించాడని, తనను తాను ఓ వ్యాపారవేత్తగా దావూద్ పరిచయం చేసుకున్నాడని దిలీప్ వెంగ్ సర్కార్ తెలిపారు. షార్జాలో జరిగిన ఆస్ట్రేలియా-ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో ఒక వేళ భారత జట్టు పాకిస్థాన్ జట్టును ఓడిస్తే తమ జట్టులోని ప్రతీ ఒక్కరికి టయోటా కారోల కారును బహుమతిగా ఇస్తానని దావూద్ ప్రకటించినట్లు సర్కార్ చెప్పారు.

ఆ సమయంలోనే డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన భారత ఆటగాడు కపిల్ దేవ్ అతనెవరని అడిగినట్లు తెలిపారు. అతనెందుకు రూంలోకి వచ్చాడని తమను ప్రశ్నించినట్లు వెంగ్ సర్కార్ తెలిపారు. దావూద్ ఇబ్రహీంను రూంలో నుంచి బయటికి వెళ్లాలని కపిల్ కోరినట్లు సర్కార్ చెప్పారు. అప్పుడు అతను ఎవరో తెలియదని వెంగ్‌సర్కార్ చెప్పాడు.

కపిల్ స్పందనతో ఆగ్రహం వ్యక్తం చేసిన దావూద్ ఆగ్రహంగా రూంలో నుంచి బయటికి వెళ్లాడని సర్కార్ తెలిపాడు. అంతేగాక తన కారు బహుమతిని కూడా దావూద్ రద్దు చేసుకున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో కపిల్ దేవ్‌కి తను మాట్లాడిన వ్యక్తి దావూద్ అని తెలియదని సర్కార్ తెలిపారు. అయితే అతను రూంలోకి రావడాన్ని అనుమతించలేదని, అతని బహుమతిని కపిల్ నిరాకరించాడని అన్నారు. కాగా ఆ ఫైనల్ మ్యాచులో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది.

English summary
In a big revelation, former Indian cricketer Dilip Vengsarkar has claimed that underworld don Dawood Ibrahim had offered car to each member of Indian cricket team including Kapil Dev as a reward if they defeated Pakistan in the final of Austral-Asia Cup in 1986.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X